కాంగ్రెస్ లొల్లి : ఉంటే ఉండు పోతే పో..!

MOHAN BABU
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లాలనుకుంటే వెళ్ళండి పార్టీలో ఉండి వెన్నుపోటు పొడవద్దు. వైఎస్సార్ బతికుంటే తెలంగాణ వచ్చేదికాదని విజయమ్మ అన్న మాటలను కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సమర్థిస్తారా? పార్టీ నిర్ణయం కాదని అది రాజకీయ సమ్మేళనం అని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ సేవలను గుర్తించి అనేక పదవులు ఇచ్చిందని, జగన్ షర్మిలలు ఎదిగిన కాంగ్రెస్ కొమ్మలను  నరకాలని చూస్తున్నారన్నారు. తండ్రి ఆత్మీయ సమ్మేళనం నికి రాని కొడుకు ఉంటాడా? అని యాష్కీ ప్రశ్నించారు. 12 ఏళ్ల తర్వాత వైఎస్ఆర్ గుర్తుకు వచ్చారన్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షా చేతుల్లో ఉండి జగన్,షర్మిల పనిచేస్తున్నారని, దీంతో వైఎస్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. ఎంపీ కోమటిరెడ్డి ఎదుగుదల, నా ఎదుగుదల అయినా సోనియాగాంధీ వల్లే అని అన్నారు. వైయస్ జీవిత లక్ష్యం రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని ఉండేదన్నారు.

 తెలంగాణ బిడ్డలు మాత్రం వైయస్ ను వ్యతిరేకించారని విషయాన్ని కోమటిరెడ్డి తెలుసుకోవాలన్నారు. కోమటిరెడ్డి కి అన్నాచెల్లెళ్ల ఆత్మీయత,అనుబంధం తెలియని వ్యక్తి అని విమర్శించారు. మాజీ సీఎం చంద్రబాబుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాఖీ కట్టడాన్ని రాజకీయం చేయడం జ్ఞానం లేని వారు చేసే పని అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ లో ఉండాలనుకుంటే ఉండొచ్చని, వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ను వ్యతిరేకించే రాజకీయ వేదిక మీదకు వెళ్లి మాట్లాడడం పార్టీకి నష్టమే అని అన్నారు. కోమటిరెడ్డి పై చర్యలు తీసుకోవాలి. ? వద్దా..? అనేది అధిష్టానం చూసుకుంటుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో, సీఎం కేసీఆర్ భేటీ దొంగలు, దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లు గా ఉందని మధుయాష్కీ అన్నారు. గతంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు నిజాం నవాబు వంగి దండం పెట్టినట్లుగానే..

 ఇప్పుడు నరేంద్ర మోడీ ముందు కెసిఆర్ కూడా మోకరిల్లారని అని ఆయన ఎద్దేవా చేశారు. ఇతర పార్టీ నాయకులను ఢిల్లీకి గులాంలంటూ  మంత్రి హరీష్ రావు విమర్శలు చేసే వారిని, ఇప్పుడు కేసీఆర్ తీరుపై ఏమంటారని ఆయన నిలదీశారు. కేసుల నుంచి బయటపడేందుకే కెసిఆర్ ప్రయత్నమని, కృష్ణా జలాలపై ఎందుకు స్పందించడం లేదన్నారు. మోడీ కి ఇచ్చిన వినతులన్ని విభజన చట్టంలో పొందుపర్చినావెనని, వాటిపై ఏడేళ్లుగా ఎందుకు మర్చిపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వాదులు అందరూ కెసిఆర్ వైఖరిని పరిశీలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: