చాలా రోజులకు బయటకు వచ్చిన తెలంగాణా మాజీ మంత్రి...?

Gullapally Rajesh
కేసీఆర్ ప్రభుత్వ పనితీరు చూస్తుంటే బాధకల్గుతుంది అన్నారు మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కృష్ణ నదీ జలాలు దోపిడీ చేస్తుంటే కేసీఆర్ పట్టించుకోవడం లేదు అని ఆయన ఆరోపించారు. నీటిపారుదల అధికారులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. పనికిమాలిన అధికారులు ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు అని విమర్శించారు. శ్రీశైలం ప్రాజెక్ట్  జలవిద్యుత్ కోసమే అంటూ అధికారులు చెప్పడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. కృష్ణా నది లో 574.6 టిఎంసి ల వాటా తెలంగాణకు ఉంది అన్నారు ఆయన.
కేసీఆర్ కు లిఫ్ట్ ప్రాజెక్ట్ ల పైనే దృష్టి .. లిఫ్టులు కట్టాలి కమీషన్లు తీసుకోవాలి అనేదే ధ్యాస అని ఆరోపణలు చేసారు. రాష్ట్రంలో ప్రాజెక్ట్ ల పేరుతో దోపిడీ జరుగుతోంది అని మండిపడ్డారు. కృష్ణా యాజమాన్య బోర్డ్  సమావేశంలో ఆంధ్ర ప్రభుత్వం అక్రమ ప్రాజెక్ట్ ల గురించి ఎందుకు మాట్లాడలేదు అని నిలదీశారు. ఆంధ్ర ప్రభుత్వం అక్రమ ప్రాజెక్ట్ ల పై సుప్రీం కు వెళ్లాలని కేసీఆర్ కు ఎన్నిసార్లు లేఖ రాసినా పట్టించుకోరు అని ఆయన ఆరోపించారు. ఒక బేసిన్ నీళ్లు మరో బేసిన్ కు తీసుకెళ్లేందుకు చట్టం ఒప్పుకోదు అన్నారు.
ఇప్పటికీ తెలంగాణలో ఆంధ్ర వాళ్ళ పెత్తనమే కొనసాగుతోంది అని విమర్శించారు. కేసీఆర్ ఆంధ్ర నాయకులకు,కాంట్రాక్టర్లకు దాసోహం అంటున్నారు అన్నారు. ప్రతిరోజూ పోతిరెడ్డిపాడు నుంచి 7 టిఎంసి ల నీళ్లు ఆంధ్రకు పోతున్నాయి అని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ఢిల్లీలో మోదీ అమిత్ షా లను కలుస్తున్నది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు అని కేసీఆర్ స్వంత ప్రయోజనాల కోసమే డిల్లీ టూర్ అని విమర్శలు చేసారు. సంగేశ్వర ప్రాజెక్ట్ పుట్టిందే ప్రగతి భవన్ లో .. దానికి పేరు పెట్టిందే కేసీఆర్ అన్నారు ఆయన. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే సంగేశ్వరం వద్ద పనులను ఆపాలి అని డిమాండ్ చేసారు. కాగా నాగం జనార్ధన్ రెడ్డి చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts

సంబంధిత వార్తలు: