బీజేపీ - టిఆర్ఎస్ బంధం.. బండి సంజయ్ నాటకం?

praveen
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి టిఆర్ఎస్ పార్టీ ఇక తిరుగులేని పార్టీగా ఉంది.  ప్రధాన ప్రతిపక్షంగా ఉంటుంది అనుకున్న కాంగ్రెస్ కాస్త చిత్తుచిత్తు అయిపోయింది. కేవలం కొన్ని సీట్లకు మాత్రమే పరిమితం అయింది. ఇలాంటి సమయంలో టిఆర్ఎస్ పార్టీ ని ఎదిరించే ప్రతిపక్షమే లేదు అనుకుంటున్న సమయంలో బీజేపీ ఊహించని విధంగా దూసుకొచ్చింది. అంతకంతకూ తన బలాన్ని పెంచుకుంటుంది. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ కు అసలు సిసలైన ప్రత్యర్థి బిజెపి అంటూ తెలంగాణ ప్రజలు అందరూ భావిస్తున్నారు.

 ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో అటు బీజేపీ నేతలు కూడా ఎంతో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా  బండి సంజయ్ ఎన్నికైన నుంచి అటు బిజెపి ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది. మరికొన్ని రోజుల్లో జరగబోయే ఉప ఎన్నిక కూడా బిజెపికి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిపోయింది  ఇలాంటి నేపథ్యంలో అటు బిజెపి ఎమ్మెల్యేలు ఎంపీలు గా ఉన్న రాజాసింగ్,అరవింద్,రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ లాంటివాళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వ తీరును ఎండగడుతూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక మంత్రులను నానా తిట్లు తిడుతున్నారు.

 అదే సమయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏకంగా పాదయాత్ర నిర్వహిస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇలాంటి సమయంలో అటు మోదీ తీసుకున్న నిర్ణయం మాత్రం బిజెపి పై ప్రజల్లో కొత్త అనుమానాలను రేకెత్తిస్తుంది. ఇటీవలే ఏకంగా ఢిల్లీలో పార్టీ ఆఫీస్ పెట్టుకునేందుకు టిఆర్ఎస్ కు స్థలం కూడా కేటాయించింది బిజెపి.  అయితే ఇప్పటి వరకు సౌత్ లో పొత్తు పెట్టుకున్న పార్టీలకు సైతం ఆఫీస్ కోసం భూమీ కేటాయించిన కేంద్రం అటు ప్రత్యర్థి పార్టీ గా ఉన్న టిఆర్ఎస్ కార్యాలయానికి భూమి కేటాయించడం మొత్తం హాట్ టాపిక్ గా మారిపోయింది.  దీంతో ఇక టిఆర్ఎస్ బిజెపి ఒకటేనని.. ప్రజలను మోసం చేయడానికే అటు బండి సంజయ్ సహా బిజెపి నేతలు అందరూ విమర్శలు చేస్తూ నాటకాలు ఆడుతున్నారు అంటూ కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ts

సంబంధిత వార్తలు: