మోడీ నిర్ణయం.. ఈటెలకు మైనస్ అవుతుందా?

praveen
హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఇక హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.  ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రధాన పోటీ అటు బీజేపీ టీఆర్ఎస్ పార్టీల మధ్య ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ కు రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవిని వదులుకోని మరి కేసీఆర్ కు సవాల్ విసిరాడు. దీంతో ఈటలను ఓడించడమే లక్ష్యంగా కేసీఆర్ వ్యూహాలను అమలు చేస్తున్నారు.

 హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు కూడా ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయ్ అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఇటీవలే మోడీ తీసుకున్న నిర్ణయం మాత్రం ఈటెలకు మైనస్ కాబోతుందా అంటే అవును అనే అంటున్నారు విశ్లేషకులు.  ఇటీవలే ఢిల్లీలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి టీఆర్ఎస్కు భూమి కేటాయించింది కేంద్ర ప్రభుత్వం.  దీనిపై అటు టిఆర్ఎస్ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది.  అయితే మోదీ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రస్తుతం ఈటెలకు మైనస్ గా మారబోతుందట.

 ఎలా అంటే ప్రస్తుతం తెలంగాణ బిజెపి నేతలు అందరూ టిఆర్ఎస్ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. దీంతో తెలంగాణలో పరిస్థితి టి ఆర్ ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా మారిపోయింది.  ఇక టిఆర్ఎస్ కు అసలు సిసలైన ప్రత్యర్థి బీజేపీ అన్నట్లుగానే ఉంది ప్రస్తుతం. ఇలాంటి సమయంలో అటు ఏకంగా మిత్రపక్షాలకు సైతం ఇప్పటివరకు భూమిని కేటాయించని కేంద్రం ఏకంగా ప్రతిపక్షం గానే ఉన్న టిఆర్ఎస్ కు ఢిల్లీలో కార్యాలయం ఏర్పాటు చేసుకునేందుకు భూమి కేటాయించడం మాత్రం ఒక షాకింగ్ పరిణామం అని చెప్పాలి..  ప్రస్తుతం హుజరాబాద్ ప్రజలను ఆకట్టుకునేందుకు బిజెపి నేతలు టిఆర్ఎస్ గురించి చెపుతున్న మాటలను ప్రజలు నమ్మే అవకాశం లేదు అని అంటున్నారు విశ్లేషకులు. ఇక బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు ఒకటే అని భావించే అవకాశం కూడా ఉందని ఇది ఈటెలకు ఎంతో మైనస్ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: