కేసీఆర్ పాలన లో ప్రజలు పిట్టళ్ల రాలిపోతున్నారు ?

Veldandi Saikiran
తెలంగాణలో కేసీఆర్ పాలనతో ప్రజలు విసిగిపోయారని బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  లంగరౌజ్ బాపూ ఘాట్ నుండి ఇవాళ  ప్రజా సంగ్రామ పాదయాత్ర ప్రారంభమైంది.  ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ... డబుల్ బెడ్ రూం ఇళ్ళు రాలేదని  మెజారిటీ ప్రజలు పాదయాత్రలో నా దృష్టికి తీసుకొస్తున్నారని తెలిపారు బండి సంజయ్‌.  టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ పార్టీ మాత్రమేనని ప్రజలు నమ్ముతున్నారని వెల్లడించారు బండి సంజయ్‌.  కేంద్రం ప్రధానమంత్రి అవాస్ యోజన కింద పేదల ఇళ్ల కోసం నిధులు టీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని నిప్పులు చెరిగారు.  

డబుల్ బెడ్ రూం ఇళ్ళ పేరుతో గోల్కొండ బోజగుట్టను కూల్చిన కేసీఆర్ ఇళ్లు నిర్మించడం లేదని...  పేదల కోసం ఇళ్ళు ఇస్తామని చెప్పి ఖాళీ చేసిన భూములను మజ్లీస్ నేతల విల్లాలకు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్‌.   జీతాలే ఇవ్వలేని కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఎలా  కట్టిస్తాడు? అని నిలదీశారు.  ప్రధానమంత్రి అవాస్ యోజన పథకం కింద వచ్చే ఇళ్లకన్న కేసీఆర్ ప్రభుత్వం సహకరించాలన్నారు. జీహెచ్ఎంసీ, స్థానిక సంస్థలకు కేంద్రం కావాల్సినన్ని  నిధులు ఇచ్చిందని స్పష్టం చేశారు.  

ఆయుష్మన్ భారత్ అమలు చేసుంటే కోవిడ్ సమయంలో ప్రజలకు ఇబ్బందులు తప్పేవని... కేసీఆర్ పాలన లో ప్రజలు పిట్టళ్ల రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న ఆరోగ్య శ్రీ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు బండి సంజయ్‌.  ఉప ఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్‌ బయటకు వస్తారని.... పాతబస్తీలో ప్రజలను కాపాడుకోవడానికే చార్మినార్ నుండి యాత్ర ప్రారంభించామన్నారు బండి సంజయ్‌.  అక్కడున్న ప్రజలకు  భరోసా కల్పించడానికి భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నుండి యాత్ర ప్రారంభించామని... కాంగ్రెస్ టీఆరెస్ పార్టీతో కలిసి పోటీ చేసిన సంగతి గుర్తు  పెట్టుకోవాలని ప్రజలకు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: