అచ్చెన్నాయుడి ఉద్య‌మాన్ని నీరుగార్చేందుకు బొత్స ప్లాన్‌..

Paloji Vinay

ఇప్పుడు ఏపీలో టీడీపీ అలాగే వైసీసీ న‌డుమ త‌గ్గ‌పోరు న‌డుస్తోంది. కాగా ఈ పోరులో ఎప్పుడూ వైసీపీదే అంతిమ విజ‌యంగా భావిస్తున్నారు అంతా కూడా. ఎందుకంటే టీడీపీ ఏ ప్లాన్ వేసినా చివ‌ర‌కు దాన్ని నీరుగార్చేందుకు వైసీపీ గ‌ట్టి కౌంట‌ర్లు వేసేస్తోంది. ఇక ఇప్పుడు కూడా టీడీపీ చేప‌ట‌ట్ఇన ఉత్తరాంధ్ర ఉద్యమం రివర్సయింద‌న్న‌ట్టు తెలుస్తోంది. ఎందుకంటే వైసీపీకి పోటీగా వీరు ఈ ఉద్య‌మాన్ని ప్రారంభించినా చివ‌ర‌కు అది త‌మ‌కే చిక్కులు తెచ్చిపెడుతోంది. అయితే వీరు స్టార్ట్ చేసిన ఉద్య‌మం కూడా విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకర‌ణ‌కు సంబంధించిందే కావ‌డం విశేషం.  
అయితే ఈ ఉద్య‌మాన్ని కూడా చేప‌ట్టింది టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఆయ‌న ఆధ్వ‌ర్యంలోనే సీరియల్ పద్ధతిలో ఉద్య‌మాన్ని ప్రారంభించారు. కాగా ఈ ఉద్యమాన్ని కూడా ఆదిలోనే గండి కొట్టేందుకు వైసీపీ మంత్రులు పెద్ద ఎత్తున ప్లాన్ వేసిన‌ట్టు తెలుస్తోంది. కాగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కోసం తాము ఎంతో చేస్తున్న‌ట్టు చెబుతున్నారు. ఉత్త‌రాంధ్ర కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హ‌యాంలో ఎంతో చేశామ‌నిర కానీ టీడీపీ హ‌యాంలో కేవ‌లం 400 కోట్లు మాత్రమే కేటాయించి గొప్ప‌ల‌కు పోతున్నారంటూ మండిప‌డ్డారు.  
అచ్చెన్నాయుడుపై ఓ రేంజ్ ల ఫైర్ అవుతున్న బొత్స సత్యనారాయణ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను తాము త‌మ ప్ర‌భుత్వం మొద‌టి నుంచి వ్య‌తిరేకిస్తున్న‌ట్టు చెప్పారు. ఇప్ప‌టికే ఈ మేర‌కు తాము శాసనసభలో కూడా తీర్మానం చేసిన‌ట్టు గుర్తు చేస్తున్నారు. అంతే కాదు గ‌తంలో టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు కేంద్రంలో నరేంద్రమోడీ క్యాబినెట్లో అశోక్ గజపతికి మం్ర‌తి ప‌ద‌వి ఇచ్చార‌ని, ఆ స‌మ‌యంలో కూడా స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ అంశం తెలిసినా పెద్ద‌గా స్పందించ‌లేద‌ని, ఎందుకు వ్య‌తిరేకించ‌లేదంటూ మండిప‌డుతున్నారు.  
గ‌తంలో కేంద్ర మంత్రిగా ఉన్న స‌మ‌యంలోనే అశోక్ గజపతి రాజుకు స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ విష‌యం తెలుస‌ని కావాల‌నే సైలెంట్ గా ఉన్నారంటూ మండిప‌డుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: