ఇవాళ్టి నుంచే బండి సంజయ్ పాదాయాత్ర... బీజేపీకి మైలేజ్ ఇస్తుందా ?

Veldandi Saikiran
ఇవాళ్టి నుండి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాద యాత్ర నిర్వహిస్తున్నారు.  అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలన విముక్తి కోసం తన పాదయాత్ర అని ప్రకటించిన బండి సంజయ్...  ఇవాళ  భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం నుండి తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. అక్టోబర్ రెండు వరకు మొదటి విడత పాద యాత్ర కొనసాగనుండగా... రోజుకు మినిమం పది కిలో మీటర్లు పాద యాత్ర నిర్వహించనున్నారు  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.  నేడు మరియు రేపు.. ఈ రెండు రోజులు మహానగరమైన హైదరాబాద్ పరిధిలోనే యాత్ర కొనసాగించనున్నారు బండి సంజయ్‌. భాగ్య లక్ష్మీ దేవాలయం నుండి ప్రారంభం అయ్యే ఈ పాదయాత్ర కు భారీ స్థాయి లో బీజేపీ పార్టీ కార్య కర్తలు పాల్గొననున్నారు.  మదీనా, అఫ్జల్ గంజ్, బేగం బజార్, ఎం. జె. మార్కెట్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ , నాంపల్లి , అసెంబ్లీ , లక్డీకాపూల్, మాసబ్ ట్యాంక్ మీదుగా బండి సంజయ్‌ యాత్ర కొనసాగనుంది. 

అయితే బండి సంజయ్ నిర్వహిస్తున్న ఈ పాదయాత్రకు పోలీసులు ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ తాను పాదయాత్ర ప్రారంభిస్తానని స్పష్టం చేశారు బండి సంజయ్ కుమార్. అయితే తాజాగా బండి సంజయ్ నిర్వహిస్తున్న ఈ పాదయాత్ర భారతీయ జనతా పార్టీకి మైలేజ్ ఇస్తుందా ?  లేదా ? అనే దానిపై తెలంగాణ రాజకీయాల్లో చర్చ మొదలైంది. బండి సంజయ్ పాదయాత్ర నిర్వహిస్తే... కచ్చితంగా కచ్చితంగా భారతీయ జనతా పార్టీకి మైలేజ్ వచ్చే అవకాశాలే ఎక్కువ ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గ్రామ మండల స్థాయిలో బలహీనంగా ఉన్నా భారతీయ జనతా పార్టీ... బండి సంజయ్ పాదయాత్ర కారణంగా కాస్త పుంజుకునే అవకాశం స్పష్టంగా ఉందని చెబుతున్నారు.

అలాగే  పాదయాత్ర సందర్భంగా బండి సంజయ్... హిందూ ఓటు బ్యాంకు ను చీల్చే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంటుంది. జిహెచ్ఎంసి ఎన్నికల మాదిరిగానే.... హిందువుల ఓట్లు బిజెపి వైపు నకు తిప్పేందుకు... బండి సంజయ్ పాదయాత్ర ఉపయోగపడుతుంది. అలాగే... ఈ పాదయాత్ర కారణంగా ప్రజలకు బీజేపీ పార్టీ మరింత దగ్గరయ్యే అవకాశం కూడా ఉంటుంది. హుజురాబాద్ ఉప ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో... ఈ పాదయాత్ర... బిజెపి పార్టీకి మైలేజీ కచ్చితంగా ఇస్తుందని రాజకీయా వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ పాదయాత్రలో బండి సంజయ్ వ్యవహరించే తీరుపై... బిజెపి పార్టీ భవిష్యత్తు కూడా ఉండనుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక బండి సంజయ్ పాదయాత్ర ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: