బండి పాదయాత్ర మళ్ళీ ఆగుతుందా...? అసలు ప్లాన్ ఏంటీ...?

Gullapally Rajesh
రేపు ఉదయం చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రత్యేకపూజలు తర్వాత బండి సంజయ్ పాదయాత్ర మొదలు పెట్టనున్నారు. 9.30గంటలకు చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం వద్ద ప్రారంభోత్సవ సభలో బండి సంజయ్ ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, డీకే అరుణ, రాజసింగ్, రఘనందనరావు, మురళీదరరావు, పొంగులేటి, ఇతర సీనియర్ నేతలు పాల్గొనే అవకాశం ఉంది. చార్మినార్, మదీన, అఫ్జల్ గంజ్, బేగంబజార్, మెజంజాహీ మార్కెట్,
ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, నాంపల్లి, అసెంబ్లీ, లకడీకాపూల్, మసాబ్ ట్యాంక్, మెహిదీపట్నం వరకు ఆయన పాదయాత్ర నడుస్తుంది. మధ్యహాన్న భోజనం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేస్తారు. ఆ తర్వాత  రాత్రి బస కోసం మెహిదీపట్నం పుల్లారెడ్డి ఫార్మసీ కళాశాలలో ఏర్పాట్లు చేసారు. మెదటిరోజు హైద్రాబాద్ మహానగరంలో 10కిలోమీటర్లు ఆయన నడిచే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం నాలుగు విడతల్లో తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నారు. మెదట విడత పాదయాత్రను అక్టోబర్ 2 గాంధీజయంతి రోజున హుజురాబాద్ లో ముగించేలా ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు.
పాదయాత్ర ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున జనసమీకరణ  చేయడం మొదలుపెట్టారు. వేల సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు పాదయాత్రలో పాల్గంటారని బిజెపి నేతలు అంటున్నారు. పాదయాత్ర కోసం గత కొన్ని రోజులుగా వాకింగ్ ప్రాక్టీసు తో పాటు.. ఆహారపు అలవాట్లను కూడా ఆయన మార్చుకున్నారు. వివిధ కారణాలతో ఇప్పటికే రెండు సార్లు బండి పాదయాత్ర వాయిదా పడింది. ఎటకేలకు శనివారం నుంచి పాదయాత్ర ప్రారంభం కాబోతోన్న నేపథ్యంలో బీజేపీ క్యాడర్ లో జోష్ వచ్చింది. అయితే దీనికి సంబంధించి ఇంకా అనుమతులు రాలేదు. బండి సంజయ్ పాదయాత్రకు ఇంకాపోలీసుల అనుమతి రాలేదు. బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి కోరుతూ గత వారం డీజీపీని కలసి లేఖ అందించారు. ఇప్పటివరకు పాదయాత్రకు పోలీసుల అనుమతి రాలేదని బీజేపీ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: