మహిళల కోసం నారా లోకేష్ ఉద్యమం ?

Veldandi Saikiran
నేడే రాఖీ పౌర్ణమి.. దేశ వ్యాప్తంగా ఎంతో ఆప్యాయంగా ఈ రాఖీ పౌర్ణమిని జరుపుకుంటారు. అయితే.. ఈ పండుగ నేపథ్యం లో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.  సమాజం లో స్త్రీ కి రక్షణ గా నిలిచి, గౌరవించే తత్వాన్ని సొంత కుటుంబం నుంచే  అలవాటు చేసే ఉత్తమ సంప్రదాయాని కి ప్రతీక రాఖీ పౌర్ణమి పండుగ అని నారా లోకేష్‌ పేర్కొన్నారు.  

తోడ బుట్టిన అక్క చెల్లెళ్ల కే కాదు, జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి మహిళ కు అన్న గా అండ గా నిలవడం మన కర్తవ్యం అని భారతీయ సంస్కృతి చెబుతోందని తెలిపారు. కానీ ఈ రోజు గౌరవ ప్రదమైన మంత్రి, ఎమ్మెల్యే స్థానం లో ఉన్న వారే మహిళల తో అగౌరవంగా మాట్లా డుతుండటం మన దురదృష్టమని ఆవేదన వ్యక్తం  చేశారు  నారా లోకేష్‌.   అందుకే రాష్ట్రం లో మహిళల పై ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఎమోషనల్‌ అయ్యారు.

ఇక పై ఎక్కడ ఏ ఆడపిల్ల కు అన్యాయం జరిగినా ఒక అన్న గా స్పందిస్తానని ఈ రాఖీ పౌర్ణమి రోజున ప్రతి చెల్లి కి నేను హామీ ఇస్తున్నానని నారా లోకేష్‌ స్పష్టం చేశారు. అంతే కాదు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో ఇప్పటి వరకు ఉన్మాదుల దుశ్చర్య లకు బలై పోయిన ప్రతి ఆడపిల్లకు, ఆమె కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తానని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ తీసుకుంటున్నానని వివరించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో ఎక్కడ అ న్యాయం జరిగినా ప్రశ్నించే గొంతుక గా తాను అండగా నిలబడతానని మహిళలకు హామీ ఇచ్చారు నారా లోకేష్‌. ఎవరికీ భయ పడకుండా... బాధితులకు న్యాయం చేసే వరకు ఊరుకోబోనని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: