కొడాలికి వార్నింగ్... ఆ రేంజ్ లో ఇస్తారా.. బాబోయ్..

Podili Ravindranath
మంత్రి కొడాలి నాని గురించి తెలియని తెలుగు వారు అంటూ ఉండరు. రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న వ్యక్తి కొడాలి. అసలు పేరు కొడాలి వెంకటేశ్వరరావు అయినప్పటికీ... కొడాలి నాని గానే అందరికీ తెలుసు. ఎంత మంది ఉన్నా సరే.. విలేకరుల చూపులన్నీ కొడాలి పైనే. ఆయన ఏం మాట్లాడినే ఓ సంచలనమే. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తన నియోజకవర్గం అభివృద్ది కోసం గుడివాడ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసుకుంటూ పోయారు. ఎన్టీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా... ఇంకా చెప్పాలంటే... హరికృష్ణకు వీరాభిమానిగా కొడాలి నానికి పేరు. కానీ పరిస్థితుల్లో మార్పు రావడంతో.. అనూహ్యంగా తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి... జగన్ సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక ఆ రోజు నుంచి చంద్రబాబుపైన, ఆయన కొడుకు లోకేష్ పైన ఒంటికాలిపై లేస్తున్నారు. ఏ చిన్న విషయం వచ్చినా సరే... చంద్రబాబు పుట్టు పూర్వత్రాలు ఎత్తి మరీ తిట్టేస్తున్నారు. దీంతో ఆయనకు టీడీపీ నేతలంతా బూతుల మంత్రి అని పేరు పెట్టేశారు.


మొదట్లో కొద్ది రోజుల పాటు ఆయన మాటలను ఖండించేందుకు కూడా తెలుగుదేశం పార్టీ నేతలు ఇబ్బంది పడ్డారు. ఎక్కడ తమపై కూడా ఎదురు దాడి చేస్తారో అని అంతా భయపడ్డారు కూడా. కానీ ఇప్పుడా భయం పోయనట్లుగా కనిపిస్తోంది. బూతుల మంత్రి అంటూ ఇప్పుడు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకు వేశారు. ఆయనకు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ముందుగా టీడీపీ ఎస్సీ సెల్ అథ్యక్షుడు ఎం.ఎస్.రాజు ఘాటుగా వ్యాఖ్యానించగా... ఆ తర్వాత నేను ఉన్నా అంటూ పిల్లి మాణిక్యాల రావు తనదైన శైలిలో విమర్శించారు. ఇప్పుడు గురజాల మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు మరో అడుగు ముందుకు వేశారు. మంత్రి కొడాలిని ఓరేయ్ అని సంభోందిచారు యరపతినేని. అంతటితో ఆగకుండా... ఓ సినిమా డైలాగ్ కూడా వేశారు. తమ ప్రభుత్వం వచ్చిన గంటలోనే అంకుశం సినిమాలో విలన్ రామిరెడ్డిని హీరో కొట్టినట్లుగా నడిరొడ్డు మీద కుక్కని కొట్టినట్లు కొట్టుకుంటూ తీసుకెళ్తాం అనేశారు యరపతినేని. ప్రస్తుతం యరపతినేని శ్రీనివాసరావు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. యరపతినేని వార్నింగ్ కు టీడీపీ ఫాలోవర్స్... సూపర్ అంటూ కామెంట్ చేస్తుంటే... వైసీపీ అభిమానులు మాత్రం మునిగిపోయే నావకు ఎందుకింత సీన్ అంటున్నారు. మరికొందరైతే... నిన్ను కూడా అలా తీసుకెళ్లాలా... అని కౌంటర్ ఇస్తున్నారు. ఏదీ ఏమైనా... ప్రస్తుతం కొడాలి నానికి యరపతినేని వార్నింగ్ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: