బూతు - ట్రూతు : వెతకాలి వెతికితే కానీ దొర‌క‌రు..!

RATNA KISHORE
తిట్టేవారు కావాలి బూతులు తిట్టేవారు కావాలి
బూతులు తిట్టేవారు ధ‌న్యులు క‌నుక‌నే కావాలి
మైలేజీ పెంచేవారు కావాలి.. ప‌దాలు  అర్థాలు
ఏమ‌యినా వాడుకోండి.. కానీ మాకు ప‌నికి రావాలి మీరు

 
ఇదీ ఇవాళ్టి రాజ‌కీయం. కాంగ్రెస్ కు ఆల్రెడీ ఒక‌డున్నాడు. ఆడు ఈడు అని తిడుతూ ఉన్నాడు అత‌డు ఆయ‌న పేరు రేవంత్. ఇం కేం చాలు. ఇప్పుడాయ‌న టీపీసీసీ చీఫ్. రేపు ఏపీపీసీసీకీ చీఫ్ అవుతాడు. డు డు డు ఇంకేం కేసీఆర్ ను, జ‌గ‌న్ ను ఏక‌కా లంలో తిట్టే ఛాన్స్ మ‌న ద‌మ్మున్న వీరుడూ శూరుడూ అయిన రేవంత్ కు ద‌క్కుతుంది. ఎలానూ శోభ అనే బీజేపీ లీడ‌ర్ కేసీఆర్ ను తి ట్టింది. తిడుతోంది. మ‌ల్ల‌న్న అనే చిల్లర లీడ‌ర్ ఎలానూ కేసీఆర్ కు రోజూ త‌న బూతు పురాణం వినిపిస్తూనే ఉన్న‌డు. వీరి కోవ‌లో బండి సం జ‌య్ కూడా చేరి ఉన్న‌డు. ఇంకేం తెలంగాణ‌లో కేసీఆర్ ను టార్గెట్ చేసేవారు చాలా ఎక్కువ. ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ తో స‌హా!


తెలంగాణ సంగ‌తి స‌రే ఆంధ్ర‌లో ఆ కోవ‌లో ఎవ‌రున్న‌రు. చంద్ర‌బాబును తిట్టాలి కొడాలి నాని ఉన్నాడు. చంద్ర‌బాబును తిట్టిం చాలి.. ఇంకేం రోజా రెడ్డి ఉన్న‌రు. చంద్ర‌బాబును మ‌రింత ఎక్కువ తిట్టాలి. ఇంకేం ఉన్న‌డు వంశీ వ‌ల్ల‌భ‌నేని..వీరికి తోడు ల‌క్ష్మీ పార్వ‌తి అనే లీడ‌ర్ కూడా అప్పుడ‌ప్పుడూ తోడ‌వుతారు. ఉండ‌విల్లి లాంటి లీడ‌ర్ కూడా అప్పుడ‌ప్పుడూ బాబును టార్గెట్ చేస్తారు. ఆ ప్రాంతం నుంచే మ‌రో లీడ‌ర్ కూడా ఉన్నారు లేండి. ఉండ‌విల్లి అంత‌టి స‌మ‌ర్థుడే కానీ తిట్లలో ఉండ‌విల్లిని దాటేయ‌గ‌ల‌డు. ఆయ‌నే గోరంట్ల. ఇప్పుడీయ‌న జ‌గ‌న్ న‌యా అస్త్రం. చంద్ర‌బాబు ఇదే కోవ‌లో ఆలోచిస్తే.. జ‌గ‌న్ ను తిట్టాలంటే సోమిరెడ్డి ఉన్న‌డు. అచ్చెన్న ఉన్న‌డు..ఇంకా లోకేశ్ కూడా ఉన్న‌డు. రెడ్డి సామాజిక వ‌ర్గం లీడ‌ర్లు అంత‌గా బాబు ద‌గ్గ‌ర లేరు క‌నుక ఆ వేట‌లో టీడీపీ బాస్
ఉంటే ఉండాలి. సొంత సామాజిక‌వ‌ర్గం నుంచి ఎదిగిన నేత‌లే చంద్ర‌బాబును తిట్టారు. అదీ ఆయ‌న సొంత మ‌నుషులు అన్న ముద్ర పొంది కూడా!


ఆ విధంగా జ‌గ‌న్ స‌క్సెస్. నాని సొంత మ‌నిషి. వంశీ  సొంత మ‌నిషి. అయినా స‌రే! ఎందుక‌నో చంద్ర‌బాబును నోటికి  వ‌చ్చిన  విధం గా తిట్టారు. ఇక టీడీపీలో రోజాకు జ‌రిగిన అన్యాయం ఏంటో ఇప్ప‌టికీ పాలుపోదు కానీ ఆమె కూడా చంద్ర‌బాబు ను ఇష్టానుసారం తిడుతూనే ఉంటుంది. ఇంకేం కొత్త‌వారు ఎవ్వ‌ర‌యినా ఉంటే అటు జ‌గ‌న్ కానీ ఇటు కేసీఆర్ కానీ వెతికితే బూతు పురాణం కార ణంగా నాలుగు ఓట్లు రాబ‌ట్టుకునే ఛాన్స్ త‌ప్ప‌క రావొచ్చు. లేదా మీడియాలో మైలేజీ పెర‌గ‌డం కూడా ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: