వైసీపీ టాక్స్ : నానీకి తోడుగా బుచ్చ‌య్య ఉంటారా?

RATNA KISHORE
రాజ‌మండ్రి కేంద్రంగా చంద్ర‌బాబును
తిట్టాలి అంటే ఉండ‌వల్లి ఉన్నాడు
ఆయ‌న‌కు తోడుగా ఈయ‌న
లేదా అసెంబ్లీ వేదిక‌గా చంద్ర‌బాబును
తిట్టాలి అంటే కొడాలి నాని ఉన్నాడు
ఆయ‌న‌కు తోడుగా ఈయ‌న
వేదిక‌లు ఏమ‌యినా ప్ర‌భుత్వాల తీరు
ఒక్క‌టే ప్ర‌త్య‌ర్థిని తిట్టించడం కోసం
కొత్త ముఖాల వెతుకులాట!
అధికారం అనే చీక‌టి ఇచ్చే వ‌రం ఇదొక్క‌టే!
చీక‌టే వెలుగు కాదు కాబోదు కూడా!
అన్న‌గారిని కాద‌న్నాడు..అల్లుడినీ కాద‌న్నాడు..అచ్చెన్న‌నూ కాద‌న్నాడు. వాస్త‌వానికి అత‌డు ఎర్ర‌న్న‌కు క్లోజ్ .. అచ్చెన్న‌కూ క్లోజ్ ..అయినా అధ్య‌క్షుడిపై కోపం కార‌ణంగా ప‌ద‌వి లేని.. ప్రాముఖ్యం లేని..గౌర‌వం లేని చోట..ఉండ‌డం త‌గ‌దు అనుకుని టీడీపీలో త నంత‌ట తానే త‌న చాప్ట‌ర్ ను క్లోజ్ చేసుకుంటున్నార‌న్న‌ది రాజమండ్రి వాసుల గుస‌గుస..క‌మాన్ గుస గుస అనుండ్రి.. ఇంకేమ యినా తెలుస్తయా?

 
జ‌గ‌న్ అండ్ కో కు పండుగ లాంటి వార్త. వెన్నెల స‌మీపించే రోజుల‌లో వెన్నెల్లాంటి వార్త. గోరంట్ల‌తో స‌హా ఇంకొంద‌రు వెళ్తే చంద్రుడి కి  చ‌వితి పండుగ ముందే త‌ప్ప‌వు ఇబ్బందులు. నీలాప‌నింద‌లు త‌ప్ప‌వు..ఇంకా ఏవేవో! చ‌వితి చంద్ర ద‌ర్శ‌నం త‌రువాత ముం దు ఈ గ్ర‌హణం వీడితే చాలు. చాలా రోజుల‌కు  కొత్త ఆనందాలు ఏవీ లేవ‌న్న బాధ‌తో కూడిన భ‌యంతో కూడిన ఆవేద‌న  ఒక‌టి ఉం టుంద‌న‌గా మ‌ళ్లీ పుట్టిన ముస‌లం. త‌న‌కు తెల్సిన పార్టీలో త‌న‌కు తెలియ‌ని వారు వీరంతా? వెళ్తూ వెళ్తూ ఏమి చెప్పిపోతారో గో రంట్ల ! ఇదే క్ర‌మంలో రాజ‌మండ్రి వీధుల‌లో వ‌చ్చే మార్పు ఏంటి. అభివృద్ధి దిశ‌గానా లేదా స్వీయ ప్ర‌యోజ‌న రీత్యానా?

చాలా కాలానికి వైసీపీకి కొత్త గొంతుక దొరికింది. చాలా కాలానికి  జ‌గ‌న్ మిత్ర బృందానికి మ‌రో తోడు కుదిరింది. ఫలిత‌మో ఏమో కా నీ చాలా రోజుల‌కు చంద్ర‌బాబులో క‌ల‌వ‌రం మొద‌ల‌యింది. ఏనాటి బంధ‌మో తెంపుకుని గోరంట్ల త‌న దారి తాను చూసుకోవ డం తో రాజ‌కీయం మ‌లుపు తిరిగింది. ఈ క్ర‌మంలో రాజ‌మండ్రి న్యూస్ పూర్తిగా అర్థాలే మార్చేసుకుంది. గోదా వ‌రి ఎక్స్ ప్రెస్ శ‌ర వేగంగా దూసుకుపోతోంది. ఇంత‌వ‌ర‌కూ చంద్ర‌బాబు పార్టీలో ఎదురులేకుండా ఏక‌ఛ‌త్రాధిప‌త్యం కొన‌సాగించారు. కుమార రాజాకు
కూడా అదే ప్ర‌గ‌తి ద‌క్కింది. అదే పేరు ద‌క్కింది. ఈ పేరూ ఆ ప్ర‌గ‌తీ కార‌ణంగా చంద్ర‌బాబు ఒంట‌రయ్యారు. త‌న‌ను ఒంట‌రి చేసుకు ని చుట్టూ ఎందరున్నా వారికి ఓ స‌మాధానం ఇవ్వాల‌న్న ఆలోచ‌న లేక‌పోయింది. చ‌ద‌రంగంలో ఆయ‌న ఓడిపోయి ఒంట‌రి అ య్యారు. ఆయ‌న‌ను ఒంట‌రి చేసి మిగిలిన వారు కొత్త గొంతుక‌లుగా మారుతున్నారు. ప్ర‌త్య‌ర్థుల‌కు తాము వ‌రాలు అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: