కొడాలి ఇలాకాలో చంద్రబాబుకు మ‌రో త‌ల‌నొప్పి మొద‌లైందా ?

VUYYURU SUBHASH
కృష్ణా జిల్లాలోని గుడివాడ అంటే ఒక‌ప్పుడు తెలుగు దేశం పార్టీకి ఎంత కంచుకోటో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎన్టీఆర్ పార్టీ పెట్టి ముఖ్య‌మంత్రి అయిన‌ప్పుడు సైతం అక్క‌డ నుంచే రెండు సార్లు అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. తొలి రెండు ఎన్నిక‌ల్లోనూ ఎన్టీఆర్ అక్క‌డ నుంచే ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ హిందూపురంకు షిఫ్ట్ అయిపోయారు. ఇక గుడివాడ నుంచి రావి ఫ్యామిలీ పోటీ చేస్తూ వ‌చ్చింది. కొన్నేళ్ల పాటు గుడివాడ‌ను రావి ఫ్యామిలీ త‌న కంచుకోట‌గా మార్చేసుకుంది.
ఇక్క‌డ నుంచి దివంగ‌త రావి శోభ నాద్రి చౌద‌రి వ‌రుస‌గా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ త‌ర్వాత ఆయ‌న పెద్ద కుమారుడు రావి హ‌ర‌గోపాల్ సైతం 1999లో ఎమ్మెల్యే గా గెలిచారు. ఆ త‌ర్వాత యేడాదికే ఆయ‌న యాక్సిడెంట్ లో మృతి చెందారు. దీంతో రావి ఫ్యామిలీలో రెండో వార‌సుడు రావి వెంక‌టేశ్వ‌ర రావు రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఉప ఎన్నిక‌ల్లో ఆయ‌న ఘ‌న‌విజ‌యం సాధించారు. అయితే 2004లో కొడాలి నానికి సీటు ఇవ్వాల‌ని జూనియ‌ర్ ఎన్టీఆర్ సిఫార్సు చేయ‌డంతో సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న రావి వెంక‌టేశ్వ‌ర రావును చంద్ర‌బాబు ప‌క్క‌న పెట్టారు.
ఆ త‌ర్వాత ఆయ‌న ప్ర‌జారాజ్యంలోకి వెళ్లిపోయారు. చివ‌ర‌కు 2014 ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ ఆయ‌న్ను పార్టీలోకి ఆహ్వానించి సీటు ఇచ్చారు. ఇక 2019 ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ విజ‌య‌వాడ నుంచి అవినాష్ ను తీసుకు వ‌చ్చి సీటు ఇస్తే ఆయ‌న కూడా ఓడిపోయారు. ఇప్పుడు మ‌ళ్లీ రావి వెంక‌టేశ్వ‌ర రావుకే పార్టీ ప‌గ్గాలు ఇచ్చారు. అయితే రావి వ్యాపారాల్లో బిజీగా ఉంటూ పార్టీ కార్య‌క్ర‌మాల‌కు పెద్ద‌గా ప‌ట్టించు కోవ‌డం లేద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.
ఆయ‌న వ్య‌క్తిగ‌తంగా మంచి వాడే అయినా కూడా ఇప్ప‌టి రాజ‌కీయాల్లో ఉండాల్సిన దూకుడు లేక‌పోవ‌డం గుడివాడ టీడీపీకి పెద్ద మైన‌స్ గా మారింది.
మ‌రి చంద్ర‌బాబు ఇప్ప‌ట‌కి అయినా గుడివాడ‌పై స్పెష‌ల్ గా ఫోక‌స్ పెట్ట‌క‌పోతే పార్టీ ఇక్క‌డ ఇప్ప‌ట్లో పుంజుకోవ‌డం అయితే క‌ష్టంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: