కెసిఆర్..తెలంగాణ నెంబర్ వన్ ద్రోహి ?

Veldandi Saikiran
ఢిల్లీ : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సిఎం కెసిఆర్ పై నిప్పులు చెరిగారు. ఢిల్లీ లో బిజేపి సీనియర్ నేతలతో భేటీ అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.... గోదావరి కృష్ణా బోర్డులు ఏర్పాటు చేసి నదీజలాల పంపిణీ సక్రమంగా జరిగేలా చూసేందుకు కేంద్రం బోర్డుల పరిధిని నోటిఫై చేసిందని.. కేంద్ర ప్రభుత్వం నీటి సమస్యల పరిష్కారం కోసం విభజన చట్టం లోని అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం మేరకు నోటిఫై చేశారని తెలిపారు. బోర్డుల సమావేశానికి ఇరు బోర్డుల అధికారులు హాజరయ్యారు..కానీ కేసీఆర్ డుమ్మా కొట్టారని.. హైదరాబాద్ జల సౌధ లో తెలంగాణ ఈఎన్సి సమావేశానికి హాజరు కాలేదని... ఎందుకు హాజరు కాలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు.
కేసీఆర్ నీటి విషయంలో రాష్ట్రానికి న్యాయం చేయాలనుకుంటున్నారా అన్యాయం చేయాలనుకుంటున్నారా ? కేసీఆర్ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. కెసిఆర్ తెలంగాణ నెంబర్ వన్ ద్రోహి అని.. నీటి కోసం తెలంగాణ ఏర్పడిందన్నారు.. ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇరు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని..  కృష్ణా ,గోదావరి బోర్డుల సమావేశాలకు కేసీఆర్  హాజరుకావాలని డిమాండ్ చేశారు. ఏపీ అక్రమ ప్రాజెక్టుల అంశాలను బోర్డుల ముందుకు తీసుకెళ్లవచ్చని.. బోర్డుల సమావేశాలకు కేసీఆర్ హాజరుకావాలని బిజెపి డిమాండ్ చేస్తుందని పేర్కొన్నారు.
ఎన్నికలుంటేనే కేసీఆర్ బయటకు వస్తున్నారని..కేసిఆర్  అరాచక పాలన నుంచి ప్రజలు బయట పడాలని తెలిపారు.  కేసీఆర్ జైలు  కు వెళ్లే విషయంలో మా వ్యూహం..  మాకు ఉందని.. దానిపై జెపి నడ్డా చెప్పారన్నారు. ఖమ్మం జిల్లా ఎల్లన్న నగర్ లో పోడుభూముల్లో వ్యవసాయం చేసుకునే 19మంది మహిళలను కొట్టి హత్యాయత్నం కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.  చిన్నారులు,బాలింతలను అరెస్ట్ చేశారు..మహిళల ఫొటోలను చూసి కేసీఆర్ సిగ్గు తెచ్చుకోవాలని చురకలు అంటించారు.  వ్యవసాయం చేసుకునే మహిళలను అరెస్ట్ చేసినందుకు అధికారులపై చర్యలు తీసుకోవాలని..మహిళలకు క్షమాపణలు చెప్పాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: