మంత్రుల మౌన రాగం వెనక... ?

Satya
ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు ఇలా ఒక వ్యవస్థ. ఒక నిర్ణయం తీసుకోవాలంటే మంత్రివర్గం ఆమోదం ఉండాలి. ఇక కీలకమైన శాఖలకు మంత్రులు ఉంటారు. వారు తీసుకున్న నిర్ణయాలు కూడా ప్రభావం చూపుతాయి.
రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి అంటే టీమ్ కి లీడర్. అంతే తప్ప ఆయన కూడా వారితో పాటే ఒక మంత్రే. అలాగే దేశంలో ప్రధాని అయినా. అయితే రాను రానూ మంత్రులు తక్కువ అయిపోతున్నారు. ముఖ్యమంత్రులు, ప్రధానులు ఎక్కువ అయిపోతున్నారు. ఇక ఏపీలో వైసీపీ సర్కార్ లో మాట్లాడే మంత్రులు ఎంతమంది అన్న సర్వే కనుక నిర్వహిస్తే చాలా బ్యాడ్ రిజల్ట్ వస్తుందేమో. అంత దాకా ఎందుకు జగనే ఈ మధ్య క్యాబినెట్ మీటింగులో మంత్రులు ఎవరూ మాట్లాడడం లేదని ఆవేదన వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు.
మరి మంత్రులు ఎందుకు మాట్లాడంలేదు అంటే వారి బాధ్యతలు అన్నీ కూడా సజ్జల రామక్రిష్ణారెడ్డి చూసేస్తున్నారు కాబట్టి అన్న సమాధానం వస్తుందేమో. ప్రతీ శాఖ గురించి కూడా ఆయనే మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం వల్లనే మంత్రులు సైలెంట్ అయ్యారని టాక్ వస్తోంది. ఇక సజ్జలే రాజకీయ విమర్శలు చేస్తున్నారు. దాంతో మంత్రులకు ఏ పనీ లేకుండా పోతోంది అంటున్నారు. మరో వైపు తమ పదవులు ఎంత కాలం ఉంటాయో తెలియక వారు మౌనంగా ఉంటున్నారు అన్న విశ్లేషణ ఉంది. మరి కొద్ది నెలల్లో విస్తరణ ఉంటుంది అన్న టాక్ ఉన్న నేపధ్యంలో మాజీలు ఎవరు అవుతారో తెలియదు. దాంతో పాటు తమకు సరైన గుర్తింపు ప్రాధాన్యత లేదన్న వారూ ఉన్నారు. మొత్తానికి మంత్రులలో అసంతృప్తి బాగానే ఉందని, అందుకే వారు నోరు విప్పడంలేదు అంటున్నారు. ఆ మధ్య దాకా చంద్రబాబు మీద విరుచుకుపడే కొడాలి నాని వంటి వారు సైలెంట్ కావడం కూడా ఇందులో భాగామేనా అంటే సమాధానం అవునేమో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: