డ్రగ్స్ రవాణాను అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోందా ?

VAMSI
మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతోంది ముఖ్యంగా యువత ఈ మత్తుకు బానిసలుగా మారి తమ భవిష్యత్తును తామే నాశనం చేసుకుంటున్నాయి. ప్రధానంగా వివిధ రాష్ట్రాలకు, విదేశాలకు ఈ మాదక ద్రవ్యాలు సరఫరా చేసేందుకు హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారడంతో ఇక్కడి వారికి మత్తు డ్రగ్స్ విరివిగా దొరుకుతున్నాయి అనే చెప్పాలి. దాంతో రాష్ట్రంలో ఎక్కువ మంది యువత దీనికి ఆకర్షితులై అడిక్ట్ అవుతున్నారు. భావి తరాల భవితకు మూలమైన యువత ఇలా మత్తులో తూలుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది అన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ మరియు ఒడిశా సరిహద్దుల్లో పండించే గంజాయి హైదరాబాద్‌ మీదుగా రవాణా జరుగుతోంది. ముఖ్యంగా హెరాయిన్‌ అనే డ్రగ్ సరఫరాకు హైదరాబాద్‌ ప్రధానంగా మారింది.
ఇంకోవైపు రాజస్థాన్ నుండి నల్లమందు దిగుబడి కూడా అమాంతం పెరిగిపోయింది. మహారాష్ట్రకు సరఫరా అవుతున్నటువంటి గంజాయిలో  30 శాతం దాకా ఇక్కడ హైదరాబాద్‌లోనే దింపుతున్నట్లు సమాచారం. కేవలం నెల రోజుల్లోనే హైదరాబాద్‌ విమానాశ్రయములో రూ. 121 కోట్ల ఖరీదు చేసే హెరాయిన్‌ పట్టుబడింది అంటే హైదరాబాద్ మత్తు పదార్థాలకు అడ్డాగా మారిందో స్పష్టమవుతోంది. దీంతో రాష్ట్రంలో అధికార వ్యవస్థ ఏం చేస్తోంది అంటూ కొందరు తల్లితండ్రులు, రాజకీయ నాయకులు  ప్రశ్నిస్తున్నారు. మరో వైపు అధికారులు ఎంత అలెర్ట్ గా ఉంటున్నప్పటికీ ఈ రవాణా కొనసాగుతూనే ఉంది.
వెయ్యి రూపాయలు పెడితే అంతకు పదింతలు అనగా వెయ్యికి పదివేలు లాభం అందుతుండడంతో పెద్ద మొత్తంలో సరుకు పట్టుబడుతున్న పెద్దగా పట్టించుకోకుండా తిరిగి రవాణా కొనసాగిస్తున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో డ్రగ్స్ ను రవాణా చేస్తున్నారు. ఇపుడు హైదరాబాద్ లో అధికారుల ప్రధాన కర్తవ్యం ఈ డ్రగ్స్ ముఠాకు చెక్ పెట్టడంగా మారిపోయింది. అయితే ఎలాంటి చర్యలతో ఈ మత్తు పదార్థాల సరఫరాను నియంత్రిస్తుందో చూడాలి. అయితే గతంలో కొండైర్ని అరెస్ట్ చేసినా ఈ వ్యాపారాన్ని పూర్తిగా నియంత్రించలేక విఫలమవుతుండడం చింతించాల్సిన విషయం. దేశానికి పట్టుగొమ్మలయిన యువత ఇలా అవుతుంటే ప్రభుత్వం ఏమీ పట్టనట్టు ఊరుకుంటోందని సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: