అమ‌ర‌రాజాపై బిగ్ బాంబ్ పేల్చిన రోజా...!

VUYYURU SUBHASH
రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన `అమ‌ర‌రాజా` వ్య‌వ‌హారంపై టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. అమ‌ర‌రాజా బ్యాట‌రీస్ ఫ్యాక్ట‌రీ.. టీడీపీ నేత‌, గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ కుటుంబానికి చెందింది కావ‌డం.. ఆయ‌న గ‌త కొంత‌కాలంగా ప్ర‌భుత్వ విధానాల‌ను ఇటురాష్ట్రంలోను, అటు కేంద్రంలోనూ ఎండ‌గ‌డుతున్నారు. ముఖ్యంగా రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో ప్ర‌త్యక్ష పోరాటా నికి కూడా గ‌ల్లా దిగారు. అదేస‌మ‌యంలో సీఎం జ‌గ‌న్‌పైనా.. మూడు రాజ‌ధానులపైనా.. విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే త‌మ నాయ‌కుడికి చెందిన కంపెనీని.. వైసీపీ ప్ర‌భుత్వంటార్గెట్ చేసింద‌ని.. టీడీపీ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.
అయితే.. వైసీపీ ప్ర‌భుత్వం మాత్రం గ‌ల్లా ఫ్యాక్టరీ.. అమ‌ర‌రాజా కార‌ణంగా.. కాలుష్యం పెరుగుతోంద‌ని.. ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని.. ఈ కంపెనీలో ప‌నిచేస్తున్న కార్మికుల శ‌రీరంలో సీసం అసాధార‌ణ స్థాయిలో ఉంద‌ని.. అందుకే దీనిని రీలొకేట్ చేయాల‌ని కోరుతున్నామ‌ని చెబుతోంది. ఇదే విష‌యంపై గ‌డిచిన నాలుగు రోజులుగా ప్ర‌భుత్వం త‌రఫున కీల‌క స‌ల‌హాదారు.. సజ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిలు వివ‌రణ‌లు ఇస్తున్నారు. అదేస‌మ‌యంలో టీడీపీ నేత‌లు కూడా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ క్ర‌మంలో అమ‌ర‌రాజా కంపెనీ వ్య‌వ‌హారం.. ఇరు పార్టీల మ‌ధ్య తీవ్ర వివాదంగా మార‌డం గ‌మ‌నార్హం.
అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ విష‌యంలో మంత్రులు అది కూడా పెద్దిరెడ్డి మిన‌హా ఎవ‌రూ జోక్యం చేసుకోలే దు. కానీ, చిత్తూరు జిల్లా న‌గ‌రి ఎమ్మెల్యే రోజు.. జోక్యం చేసుకుని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అమర రాజాది రాజకీయ సమస్య కాదన్న రోజా.. పొల్యూషన్ సమస్య అని చెప్పుకొచ్చారు.  అమర రాజా ఫ్యాక్టరీ వ్యవహారంలో టీడీపీ రాద్ధాంతం చేస్తోందని, ఈ ఒక్క కంపెనీని బూచిగా చూపించాల్సిన అవ‌స‌రం త‌మ ప్ర‌భుత్వానికి లేద‌ని .. రోజా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అమరరాజాతో పాటు 54 ఫ్యాక్టరీలకు నోటీసులు ఇచ్చారని తెలిపారు.
గతంలో విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ ఘటనపై టీడీపీ అధినేత‌ చంద్రబాబు గగ్గోలు పెట్టారని.. మ‌రి ఇప్పుడు.. త‌న సొంత పార్టీ నేత‌కు చెందిన కంపెనీ ప్రాణాలతో చెల‌గాటం ఆడుతున్నా..  చూస్తూ ఊరుకోవాలా? అని బాబును నిల‌దీశారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు మౌనంగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు.. ఒక్క‌సారిగా అలెర్ట్ అయ్యారు. నిజానికిఇటీవ‌ల కాలంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఇలాంటి వివాదాస్పద విష‌యాల్లో జోక్యం చేసుకోవ‌డం లేదు. అయితే.. ఎవ‌రో ఒక‌రు జోక్యం చేసుకుంటే మాత్రం.. వెంట‌నే స్పందిస్తున్నారు. మ‌రి ఇప్పుడు ఎవ‌రెవ‌రు స్పందిస్తారో.. చూడాలి. ఏదేమైనా.. రోజా వ్యాఖ్య‌లు మాత్రం రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: