కార్పొరేటర్‌ నుంచి అధ్యక్షుడి స్థాయికి బండి సంజయ్‌.. ఎలా సాధ్యమైంది ?

Veldandi Saikiran
బండి సంజయ్... ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఈ పేరు బాగా పాపులర్. బండి సంజయ్ బిజెపి తెలంగాణ అధ్యక్షుడు అయినప్పటి నుంచి.... ఆ పార్టీ మంచి ఊపులోకి వచ్చింది. తనదైన ప్రసంగాలతో అధికార టీఆర్ఎస్ పార్టీ కి చెమటలు పట్టిస్తున్నాడు బండి సంజయ్. అయితే ఇవాళ తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన గురించి ఆయన ప్రస్థానం గురించి తెలుసుకుందాం.
బండి సంజయ్ సొంత ఊరు కరీంనగర్ జిల్లా తీగల గుట్టపల్లి. బండి సంజయ్ కుమార్ ది సామాన్య మధ్యతరగతి కుటుంబం. ఆయన తండ్రి బండి నర్సయ్య గౌర్నమెంట్ టీచర్గా పనిచేసేవారు. పదవి విరమణ చేసిన తర్వాత కూడా ఆయన ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేసేవారు. బండి సంజయ్ తల్లిదండ్రులకు నలుగురు సంతానం. ఇద్దరు అన్నలు ఒక అక్క తర్వాత ఇంట్లో అందరికన్నా చిన్నవాడు బండి సంజయ్. బండి సంజయ్.. భార్య అపర్ణ... ఆమె ఎస్బిఐ బ్యాంకులో ఉద్యోగం చేస్తుంది. వీరికి ఇద్దరు కుమారులు.
రాజకీయ ప్రస్థానం :
మొదటినుంచి ఏబీవీపీ కార్యకర్తగా ఉన్నా బండి సంజయ్... 2005లో ఏర్పడిన కరీంనగర్ నగర పాలక సంస్థ కు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి 48వ డివిజన్ నుంచి బీజేపీ కార్పొరేటర్ గా మూడు సార్లు గెలిచారు. సంజయ్ రెండు పర్యాయాలు కరీంనగర్ బిజెపి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2014 సాధారణ ఎన్నికల్లో శాసనసభ బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి బండి సంజయ్ ఓడిపోయారు. ఆ తర్వాత 2018 లో   అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు అయితే అప్పుడు కూడా... గంగుల కమలాకర్ పై 14000 పైగా ఓట్ల తేడాతో ఓడిపోయాడు బండి సంజయ్. ఇక 2019 లో జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరఫున మరోసారి... కరీంనగర్ ఎంపీగా పోటీ చేశారు బండి సంజయ్. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ పై 87 వేల పై చిలుకు ఓట్లతో తేడాతో భారీ విజయం సాధించారు. దీంతో బీజేపీ హైకమాండ్ మార్చి 11, 2020న తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ ని నియమించింది. బండి సంజయ్‌ అధ్యక్షుడు అయిన తర్వాత దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీని తిరుగులేని శక్తిగా నిలిపారు. బండి సంజయ్‌ ప్రసంగం నచ్చి చాలా మంది బీజేపీ చేరడం విశేషం.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: