గుడివాడలో జనసేనతో కొడాలికి ఇబ్బందేనా?

M N Amaleswara rao

కృష్ణా జిల్లాలో వైసీపీకి మంచి బలం నియోజకవర్గాల్లో గుడివాడ ఒకటి. ఇక్కడ ఒకప్పుడు టీడీపీ హవా ఉండేది. కానీ కొడాలి నాని దెబ్బకు గుడివాడ వైసీపీకి కంచుకోటగా మారింది. గత రెండు పర్యాయాల నుంచి ఇక్కడ నానికి చెక్ పెట్టడం టీడీపీ వల్ల కావడం లేదు. అభ్యర్ధులని మార్చిన పెద్దగా ఉపయోగం ఉండటం లేదు. ఇక ఇప్పుడు మంత్రి అయ్యాక నాని మరింత బలపడ్డారు. నెక్స్ట్ ఎన్నికల్లో కూడా నానికి చెక్ పెట్టడం టీడీపీకి సాధ్యం కాదని విశ్లేషణలు వస్తున్నాయి.


ఇదే సమయంలో గుడివాడలో కొడాలికి జనసేన వల్ల కాస్త మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన వల్ల ఓట్లు చీలి టీడీపీకి డ్యామేజ్ జరిగిన విషయం తెలిసిందే. కానీ గత ఎన్నికల్లో గుడివాడ బరిలో జనసేన ఉంటే, కొడాలికి ఇబ్బంది అయ్యేది అంటున్నారు. ఎందుకంటే గత రెండు పర్యాయాలు గుడివాడలో జనసేన పోటీ చేయలేదు. 2014లో పవన్, టీడీపీకి సపోర్ట్ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో జనసేన తరుపున గుడివాడలో ఏ నాయకుడు పోటీ చేయలేదు.


దీంతో జనసేనకు పడే ఓట్లు నానికే పడ్డాయని అంటున్నారు. జిల్లాలో మిగతా నియోజకవర్గాల్లో పరిస్తితి ఎలా ఉంటుందో తెలియదుగానీ, జనసేనకు కీలకంగా ఉండే కాపు ఓటర్లు మాత్రం గుడివాడలో ఎక్కువగా నానికి సపోర్ట్‌గా ఉంటారు. కొందరు పవన్ కల్యాణ్ అభిమానులు సైతం నానికే సపోర్ట్ ఉంటారు. వీరు టీడీపీ వైపుకు వెళ్లరు.


గత రెండు పర్యాయాలు జనసేన పోటీలో లేకపోవడం వల్ల వారు నానికే సపోర్ట్ ఇచ్చారు. ఒకవేళ జనసేన బరిలో ఉంటే నానికి పడే ఓట్లు కాస్త అటు వెళ్ళే ఛాన్స్ ఉందని అంటున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో జనసేన బరిలో ఉంటే ఓట్లు కాస్త చీలి నానికి ఇబ్బంది అవ్వొచ్చని చెబుతున్నారు. కానీ గుడివాడలో పార్టీలకు అతీతంగా నానికి అభిమానులు ఉంటారని, ఆయన్ని దెబ్బకొట్టడం ఎవరి వల్ల కాదని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. మరి చూడాలి గుడివాడలో జనసేన వల్ల నానికి ఎలాంటి ఇబ్బంది ఉంటుందో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: