అయ్యబాబోయ్.. మళ్ళీ టారీఫ్ చార్జీలు పెరగనున్నాయ్?

praveen
గత ఏడాది వరకు ప్రతి ఒక్క టెలికాం రంగ సంస్థకు సంబంధించిన కస్టమర్ అతి తక్కువ ధరకే అన్ని రకాల సేవలను పొందారు. కానీ ఆ తర్వాత మాత్రం దేశంలోనే మూడు అతిపెద్ద టెలికాం రంగ సంస్థలైన భారతి ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా సంస్థలు డిసెంబర్ నెలలో చార్జీలు పెంచుతూ తమ తమ కస్టమర్లకు షాక్ ఇచ్చాయి. దీంతో అంతకుముందు వరకు అతి తక్కువ ఖర్చుతోనే అన్ని రకాల సేవలు పొందిన కస్టమర్లు ఒక్కసారిగా ఛార్జీలు పెరిగిపోవడంతో లబోదిబోమంటున్నారు. అయితే ఆ తర్వాత కాలంలో కూడా మళ్లీ ఛార్జీలు పెంచాలని పలు టెలికాం రంగ సంస్థలు భావించినప్పటికీ కుదరలేదు.

 అయితే ప్రస్తుత సమయంలో టెలికాం రంగంలో నెలకొన్న ఒత్తిడిని తట్టుకునేందుకు మరోసారి ఛార్జీలను పెంచాలని  భారతి ఎయిర్టెల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో ఎయిర్టెల్ చార్జీలు పెంచే అవకాశం ఉంది అని టాక్  వినిపిస్తోంది. ఇప్పటికే పలుమార్లు ప్రస్తుత టెలికాం రంగంలో వస్తున్న వత్తిడిని జయించాలంటే చార్జీలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ భారతీ ఎయిర్టెల్ అభిప్రాయం వ్యక్తం చేసింది. అదే సమయంలో ఇక మిగితా టెలికాం రంగ సంస్థలను వదిలేసి ఏకపక్షంగా చార్జీలు పెంచేందుకు భారతి ఎయిర్టెల్  సిద్ధంగా లేదు అని ఎయిర్టెల్ సంస్థ చైర్మన్ సునీల్ మిట్టల్ స్పష్టత ఇచ్చారు. అయితే ఇలా టారీఫ్ చార్జీలు పెంచేందుకు మిగతా టెలికాం రంగ సంస్థలు కూడా తమతో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

 మిగతా టెలికాం రంగ సంస్థలు ఎయిర్టెల్ తో కలిసి నడిస్తే టారిఫ్ చార్జీలు పెంచేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే మార్కెట్లోకి జియో ఎంట్రీతో టెలికాం రంగ సంస్థల మధ్య పోటీ ఎంతగానో పెరిగింది. ఇక మరికొన్ని రోజుల్లో జియో 4g స్మార్ట్ ఫోన్ కూడా విడుదల చేస్తాము అని చెప్పింది. ఇది కాస్త నిజమైతే అటు టెలికాం రంగ సంస్థల మధ్య పోటీ మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే అన్ని టెలికాం సంస్థలు కలిస్తేనే చార్జీలు పెంచుతానని లేదంటే ఛార్జీలు పెంచే ఉద్దేశ్యం తమకు లేదని అంటూ భారతీ ఎయిర్టెల్ సంస్థ చైర్మన్ స్పష్టం చేశారు.  ప్రస్తుతం మార్కెట్లో ఎదుర్కొంటున్న ఒత్తిడి  దృష్ట్యా కొంత మేరకు చార్జీలు అవసరం ఎంతైనా ఉంది అని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరి మిగతా కంపెనీలు కూడా అటు ఎయిర్టెల్ తో కలిసి నడిచి చార్జీలు పెంచి పోతున్నాయి అనే టాక్ వినిపిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: