అక్కడ వైసీపీకి ‘కమ్మ’ సపోర్ట్ తగ్గుతుందా?

M N Amaleswara rao

సాధారణంగా ఏపీలో ఉన్న కమ్మ కులం తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా మద్ధతుగా ఉంటుందనే విషయం తెలిసిందే. అందుకే ఆ పార్టీలో కమ్మ నేతల డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. అలా అని కమ్మ సామాజికవర్గం పూర్తిగా టీడీపీలోనే ఉందని కాదు. రెడ్డి వర్గం ప్రభావం ఎక్కువగా ఉన్న వైసీపీలో సైతం కమ్మ నేతలు ఉన్నారు. అలాగే కమ్మవర్గానికి చెందిన కొందరు వైసీపీకి మద్ధతుగా ఉన్నారు.


మంత్రి కొడాలి నానితో పాటు వైసీపీలో ఓ ఐదుగురు ఎమ్మెల్యేలు కమ్మ వర్గానికి చెందిన వారే. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో వైసీపీలో కమ్మ వర్గానికి చెందిన నేతలు ఎక్కువగా ఉన్నారు. అలాగే ఆ జిల్లాలో కమ్మ ఓటర్లు కొంతవరకు వైసీపీకి మద్ధతుగా ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరుపున జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిచారు. ఒక ఎంపీ గెలిచారు. ఇక వారి గెలుపులో కమ్మ ఓటర్లు కీలక పాత్ర పోషించారు. అలాగే పలు నియోజకవర్గాల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కమ్మ నాయకులు ఓడిపోయారు.


ఇక వారిని ఓడించి వేరే వర్గాలకు చెందిన వైసీపీ నేతలని గెలిపించడంలో కమ్మ ప్రజల మద్ధతు ఉందనే చెప్పొచ్చు. అలా గత ఎన్నికల సమయంలో జిల్లాలో ఉన్న కమ్మ ఓటర్లు కొందరు వైసీపీకి మద్ధతు ఇచ్చారు. కానీ ఇప్పుడు వారు నిదానంగా వైసీపీకి దూరం అవుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే అధికార వైసీపీలో కమ్మ వర్గానికి పెద్ద ప్రాధాన్యత రావడం లేదనే అసంతృప్తిలో ఉన్నారని తెలుస్తోంది. ఒక్క కొడాలి నాని తప్ప, జగన్ ప్రభుత్వంలో కీలక పదవులు కమ్మ నేతలకు రాలేదు.


ఇటు గుంటూరు జిల్లాలో వైసీపీలో కీలకంగా ఉన్న మర్రి రాజశేఖర్, రావి వెంకటరమణ లాంటి కమ్మ నేతలకు సైతం పార్టీలో పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదని కమ్మ ప్రజలు కోపంతో ఉన్నారని తెలుస్తోంది. అందుకే వారు నిదానంగా వైసీపీకి దూరం అవుతున్నారని అంటున్నారు. మొత్తానికైతే అధికార వైసీపీకి కమ్మ వర్గం కాస్త దూరమే అని చెప్పొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: