కొడాలి కూడా అదేబాటలో..తగ్గి ఉన్నారా!

M N Amaleswara rao

గత కొన్నిరోజులుగా నీటి విషయంలో ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం కడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా తెలంగాణ మంత్రులు గళం విప్పుతున్నారు. ఇదొక అక్రమ ప్రాజెక్టు అని మాట్లాడుతున్నారు. అలాగే దీన్ని ఆపేయాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసిన కూడా ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గట్లేదని తెలంగాణ నేతలు విమర్శిస్తున్నారు.


అయితే మొదట్లో తెలంగాణ నేతలకు, ఏపీ నేతలు కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమన్వయంతో ఉండాలని సూచించడంతో ఏపీ నేతలు కాస్త తగ్గి ఉన్నారు. తెలంగాణ మంత్రులు గట్టిగా మాట్లాడుతున్న కూడా, ఏపీ మంత్రులు పెద్దగా స్పందించడం లేదు. కానీ తెలంగాణ మంత్రులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. జగన్‌తో పాటు వైఎస్సార్‌పై విమర్శలు చేస్తున్నారు.


గతంలో వైఎస్సార్ తెలంగాణకు వైఎస్సార్ ద్రోహం చేస్తే, ఇప్పుడు జగన్ మోసం చేస్తున్నారని అంటున్నారు. జగన్, వైఎస్సార్‌లు తెలంగాణ నీటిని దోచుకున్న దొంగలని మాట్లాడుతున్నారు. అలాగే నక్సలైట్ల పేరుతో అనేకమంది తెలంగాణ ప్రజలని కాల్చి చంపిన వైఎస్సార్ నరరూప రాక్షసుడు అని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శిస్తున్నారు. ఇక వైఎస్సార్‌ని తిట్టినా కూడా వైసీపీ నేతలు పెద్దగా స్పందించడం లేదు. ఆఖరికి చంద్రబాబుపై విరుచుకుపడే మంత్రి కొడాలి నాని సైతం తెలంగాణ నేతలకు గట్టిగా కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేయలేదు. అసలు బాబు, లోకేష్‌లని పరుష పదజాలంతో దూషించే నాని, తెలంగాణ మంత్రులని ఒక్క మాట కూడా అనలేదు.


కాకపోతే వైఎస్సార్ రాక్షసుడు కాదని రక్షకుడు అని, వైఎస్సార్ ఉంటే రాష్ట్రం విడిపోయేది కాదని, ఏ నాయకుడుకైన వారి రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాతారని సర్ది చెప్పడానికి చూశారు. అయితే తెలంగాణ మంత్రులు ఆ రేంజ్‌లో విమర్శలు చేసినా కొడాలి నాని లాంటి వారు కూడా గట్టిగా కౌంటర్లు ఇవ్వకపోవడానికి కారణం...జగన్ పక్క రాష్ట్రాలతో సత్సబంధాలు ఉండాలనుకోవడం వల్లే, వైసీపీ నేతలు తగ్గి ఉన్నారని తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: