నిజమైన హెరాల్డ్ అంచనా... బండి సంజయ్ పాదయాత్ర...?

Chaganti
ఒకపక్క కాంగ్రెస్ పార్టీ నిన్ననే టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియమించిన నేపథ్యంలో ప్రజల్లోకి మరింత గా వెళ్లాల్సిన అవసరం ఉందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ భావిస్తున్నారు.. అందులో భాగంగానే ఆయన పాదయాత్ర ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.. జులై చివరి వారంలో పాదయాత్ర చేయడానికి బండి సంజయ్ అన్ని సిద్ధం చేసుకుంటున్నారు.. గత మూడు రోజులుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కీలక నేతలతో ఈ విషయం గురించి సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.. బీజేపీ సీనియర్ నేతలు బండి పాదయాత్ర కు సంబంధించిన రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.. 



ప్రస్తుతం హుజురాబాద్ లో ఎన్నికల వేడి ఉన్న నేపథ్యంలో పాదయాత్ర ముగింపు హుజురాబాద్ లో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ బండి సంజయ్ ముందుకు వెళ్ళేలా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. నిజానికి పాదయాత్ర చేసిన అందరూ తర్వాతి కాలంలో ముఖ్యమంత్రులు అయ్యారు. దీంతో బండి సంజయ్ పాదయాత్ర వార్తతో బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది అని చెప్పవచ్చు. 


నిజానికి గతంలో బండి సంజయ్ పాదయాత్ర చేసే అవకాశాలు ఉన్నాయని ఇండియా హెరాల్డ్ నివేదించింది. జనవరి నెలలోనే ఆయన పార్టీని అన్ని వర్గాల లోకి తీసుకు వెళ్లేందుకు అలాగే హిందుత్వ వాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూ పాదయాత్ర చేసే అవకాశం ఉందని అప్పట్లోనే మా అంచనాలను నివేదించాం. అందుకు తగ్గట్లుగానే ఆయన ఇప్పుడు పాదయాత్ర చేయడానికి సిద్ధం కావడం అందుకు సంబంధించిన అన్ని పనులు కూడా పూర్తి కావడం ఆసక్తికర అంశం అనే చెప్పాలి. ఒక రకంగా ఇది అటు కాంగ్రెస్ పార్టీతో పాటు టిఆర్ఎస్ పార్టీకి కూడా కాస్త ఇబ్బందికర అంశం అనే చెప్పక తప్పదు. మరి చూడాలి, బండి సంజయ్ పాదయాత్ర ఏ మేరకు సక్సెస్ అవుతుందో బిజెపి ఎంత వరకు బలపడుతుంది అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: