ఆ వైసీపీ నేత‌ను కుల‌మే ర‌క్షిస్తోందా... ప‌ద‌వి సేఫ్ ?

VUYYURU SUBHASH
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత‌గా ఆ పార్టీ వాళ్లు చెప్పుకునే మంత్రి కొడాలి నాని వ‌చ్చే కేబినెట్ ప్ర‌క్షాళ‌నలో ఉంటారా ? ఆ య‌న ప‌ద‌వి ఊడుతుందా ? అన్న‌దానిపై వైసీపీ నేత‌ల్లోనూ .. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో.. క‌మ్మ సామాజిక వ‌ర్గంలో చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయి. జ‌గ‌న్ కేబినెట్లో తిరిగి కొన‌సాగే 10 శాతం మంది నేత‌ల్లో కొడాలి నాని ఖ‌చ్చితంగా ఉంటార‌ని చాలా మంది చెపుతున్నారు. క‌మ్మ సామాజిక వ‌ర్గ ప్ర‌తినిధిగా జ‌గ‌న్ కేబినెట్లో ఏకైక మంత్రిగా కొడాలి నాని కొన‌సాగుతున్నారు. జ‌గ‌న్ ఈ వ‌ర్గం నుంచి ఒక్క నానికి మాత్ర‌మే ప‌ద‌వి ఇచ్చారు. అయితే జ‌గ‌న్ గ‌త ఎన్నిక‌ల ప్ర‌చారంలో చిల‌క‌లూరి పేట మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇవ్వ‌డంతో పాటు మంత్రి మంత్రిని చేసి కేబినెట్లో త‌న ప‌క్క‌న కూర్చో పెట్టుకుంటాన‌ని చెప్పారు.
ఇప్పుడు కేబినెట్ మార్పులు చేర్పుల్లో మ‌ర్రిని మంత్రిని చేస్తారా ?  లేదా ? అన్న‌దే స‌స్పెన్స్ గా ఉంది. మ‌ర్రిని కూడా జ‌గ‌న్ ఇచ్చిన మాట ప్ర‌కారం కేబినెట్లోకి తీసుకుంటే .. అప్పుడు నానిని కంటిన్యూ చేస్తారా ?  లేదా ? అన్న‌ది చూడాలి. జ‌గ‌న్ క‌నుక క‌మ్మ వ‌ర్గానికి ఒక్క మంత్రి ప‌ద‌వే కంటిన్యూ చేయాల‌ని అనుకుంటే... అప్పుడు నానిని కంటిన్యూ చేసి.. మ‌ర్రికి ప‌ద‌వి ఇవ్వ‌రా ? అన్న‌ది చూడాలి.. ఒక వేళ నానిని త‌ప్పిస్తారా ? అంటే అది డౌటే ?  ఎందుకంటే చంద్ర‌బాబు, లోకేష్‌.. టీడీపీ వాళ్ల‌ను తిట్టాలంటే నాని వల్లే సాధ్య‌మ‌వుతుంది.
నాని కేబినెట్లో ఉన్న మంత్రుల్లో బ‌ల‌మైన వాగ్దాటితో మాట్లాడ‌తారు. నాని మాట బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి వెళుతుంది. అందుకే నానిని ప‌క్క‌న పెట్టే సాహ‌సం జ‌గ‌న్ చేయ‌ర‌నే పార్టీ నేత‌లు చెప్పుకుంటున్నారు. ఇక నాని దూకుడు.. టీడీపీ, చంద్ర‌బాబు పై విమ‌ర్శ‌లు చేయ‌డంలో నానిని మించిన నేత లేక‌పోవ‌డంతో ఆయ‌న మంత్రి ప‌ద‌వి సేఫే అని.. ఆయ‌న‌కు కుల‌మే శ్రీరామ‌ర‌క్ష అని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: