ఆనందయ్య మందు పై విజయ సాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు?

praveen
తెలుగు రాష్ట్రాల్లో కృష్ణపట్నం ఆనందయ్యా కరోనా మందు ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు.  వ్యాక్సిన్ వేసుకునే వారికి సైతం కరోనా వైరస్ సోకి ఆరోగ్యం క్షీణిస్తున్నా సమయం లో  కేవలం నిమిషాల వ్యవధి లోనే కరోనా వైరస్ ప్రభావం తగ్గించి ఆరోగ్య వంతులుగా మార్చిన ఆనందయ్య మందు పై అందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక ఇటీవల ఏపీ హైకోర్టు అనుమతి ఇవ్వడం తో ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రజా ప్రతినిధులు సైతం స్వయం గా ఆనందయ్య మందు తీసుకొని ఇక ప్రజలందరికీ పంపిణీ చేస్తున్నారు.

 ఇటీవలే కృష్ణ పట్నం ఆనందయ్య మందు పై వైసీపీ పార్లమెంటరీ సభ్యులు విజయ సాయి రెడ్డి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల విశాఖపట్నం వైసీపీ కార్యాలయం లో ఫ్రంట్లైన్ వర్కర్లకు ఆనందయ్య మందు పంపిణీ చేశారు ఎంపీ విజయ సాయిరెడ్డి. ఈ సందర్భం గా మాట్లాడిన ఆయన..  కరోనా వైరస్ కట్టడికి అటు సీఎం జగన్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు అంటూ vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">విజయసాయి రెడ్డి తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని కరోనా నియంత్రణ చర్యలు ఏపీ ప్రభుత్వం చేపడుతుందన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండటమే జగన్ కోరుకుంటారన్నారు.


 కరోనా క్లిష్ట సమయం లో ఏకంగా ఇరవై రెండు వేల మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ విశాఖలో ప్రాణాలను పణంగా పెట్టి పని చేశారని ప్రశంసించారు విజయసాయిరెడ్డి. ప్రతి ఒక్కరి ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉంది అంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.  కృష్ణపట్నం ఆనందయ్య మందు వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవని తేలిపోయిందని.. అందుకే మొదటి దశలో 22000 ఫ్రంట్లైన్ వర్కర్స్ కి ఆనందయ్య మందు అందిస్తున్నామని vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">విజయసాయి రెడ్డి తెలిపారు. పలు విడుతలుగా అన్ని జిల్లాలోని ప్రజలకు ఉచితంగా ఆనందయ్యా మందు అందజేస్తామని తెలిపారు విజయసాయిరెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vsr

సంబంధిత వార్తలు: