కయ్యాలమారి చైనా.. ఈసారి ఆ దేశంపైకి దండయాత్ర..?

Chakravarthi Kalyan
చైనా.. ఇప్పుడు ప్రపంచదేశాలకు సవాల్‌ గా మారుతున్న పేరు.. చివరకు మొన్నటి నాటో సమావేశాల్లోనూ చైనా ప్రస్తావన వచ్చింది. ఇటీవల భేటీ అయిన అమెరికా, రష్యా అధ్యక్షుల చర్చల్లోనూ చైనా పేరు వచ్చింది. అంతగా కయ్యాలమారిగా మారుతోంది చైనా. ఎప్పుడూ ఏదో ఒక దేశంతో కయ్యానికి కాలుదువ్వక పోతే ఆ దేశానికి పొద్దుపోదేమో అన్నట్టుంది పరిస్థితి.
ఇప్పటికే ఓ పక్క భారత్ తో ఏడాదిగా ఉద్రిక్తతలు కొనసాగుతునే ఉన్నాయి. కొన్ని నెలల క్రితం ఫిలిప్పీన్స్ తో చైనా గొడవ పెట్టుకుంది. ఇక ఈ నెల మొదట్లో ఇండోనేషియా గగనతలంలోకి.. జలాల్లోకి చొరపడింది చైనా. ఇక ఇప్పుడు తైవాన్ ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్ లోకి చైనా విమానాల దండు వెళ్లిందన్న విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 30 వరకూ చైనా యుద్ధ విమానాలు తైవాన్‌పైకి వెళ్లాయట.
ఇప్పటికే అణు క్షిపణుల తయారీలో చైనా కనబరుస్తున్న వేగంపై ఇటీవల నాటో కూటమి డిస్కస్ చేసింది. చైనా బాధ్యతగా వ్యవహరించాలని డిమాండ్ చేసింది. అంతర్జాతీయ నియమాలను చైనా గౌరవించాలని ఏకంగా తీర్మానం చేసింది. అసలు నాటో తీర్మానాల్లో  చైనా పేరును ప్రస్తావించడం ఇదే తొలిసారి. ఇంత జరిగినా చైనా యుద్ధ విమానా లు తైవాన్ వైపు వెళ్లాయంటే మరి ఆ కయ్యాలమారి చైనా ధైర్యం ఎలా ఉందో చూడండి.
ప్రపంచానికి చైనా సైన్యంతో ముప్పు ఉందని నాటో కూటమి హెచ్చరించినట్లే ఇప్పుడు జరుగుతోందన్నమాట. తైవాన్ ఎయిర్ డిఫెన్స్ ఐడింటిఫికేషన్ జోన్లోకి వెళ్లిన చైనా విమానాల దండులో ఏకంగా అణ్వాయుధాలను ప్రయోగించే బాంబర్లు కూడా ఉన్నాయట. ఎర్లీ వార్నింగ్ యుద్ధ విమానాలు ఉన్నాయట. ఈ విమానాల దండు తైవాన్ ఆధీనంలోని ప్రాతాస్ ద్వీపాల సమీపంలోకి  ప్రయాణించాయి. తైవాన్‌ను ఆక్రమించుకోవాలని కొన్నేళ్లు గా చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పుడు మళ్లీ చైనా అలాంటి ప్రయత్నమే చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: