అదే మా లక్ష్యం.. మంత్రి కన్నబాబు కీలక వ్యాఖ్యలు?

praveen
ఇటీవలే మాన్సాన్ ట్రస్ట్ చైర్మన్ గా అశోక్ గజపతిరాజు మళ్ళీ కోట లోకి వచ్చి ప్రమాణస్వీకారం చేశారు. దీంతో మరోసారి ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయాయి.  ఓవైపు హిందూ ఆలయాలపై జరిగిన దాడులను ఉద్దేశించి అశోక్ గజపతిరాజు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో మాన్సాన్ ట్రస్టు లో జరిగిన అక్రమాలపై అటు వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ఈ విషయం పై మంత్రి కన్నబాబు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

 అదేసమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మాన్సాన్ ట్రస్ భూముల లీజ్  విషయంలో ప్రభుత్వం ఒక సరికొత్త విధానాన్ని తీసుకువచ్చేందుకు సిద్ధమైంది అంటూ మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించాడు. మాన్సాన్ ట్రస్ట్ లో ఉండి.. ప్రభుత్వ ఆధీనంలో లేని భూములు చేతులు మారుతున్నాయి అన్న విషయం గుర్తించామని తెలిపారు. మాన్సాన్ ట్రస్టులో ఉన్న భూములకు సంబంధించి నివేదికను అందించాలని అంటూ కమిటీని డిమాండ్ చేశారు మంత్రి కన్నబాబు.

 ప్రభుత్వ భూములను కాపాడటం తమ బాధ్యత అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో  ఎక్కడ కూడా భూ అక్రమ జరగనివ్వం అంటూ స్పష్టం చేశారు. 2014 నుంచి 2019 వరకు పంచ గ్రామాల సమస్యలు పరిష్కరిస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ ఇచ్చిన హామీలు మాత్రం నీటిమూటలయ్యాయి అంటూ విమర్శించారు.  దేవాలయానికి ప్రజలకు నష్టం వాటిల్లకుండా సమస్యలను పరిష్కరించడమే తమ లక్ష్యం అంటూ మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు. పంచ గ్రామాల సమస్యల పరిష్కారానికి చంద్రబాబు అనుకూలంగా ఉన్నారా అంటూ ప్రశ్నించారు మంత్రి కన్నబాబు. మరోవైపు వైసీపీ పార్లమెంటరీ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా స్పందిస్తూ... మాన్సన్ ట్రస్ట్ లో జరుగుతున్న అక్రమాలపై విచారణకు ఆదేశించామని అంటూ చెప్పుకొచ్చారు. పంచ  గ్రామాల సమస్యలపై దృష్టి సారించామని తెలిపారు.  మాన్సన్ ట్రస్ లో భూములను తన ఆస్తులకు మార్చుకోవడానికి అశోక్ గజపతిరాజు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు విజయ సాయి రెడ్డి  .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: