ఏలూరు తమ్ముళ్ళు సెట్ చేసేసుకున్నట్లేనా!

M N Amaleswara rao

టీడీపీ అధికారం కోల్పోయాక చాలామంది నేతలు సైలెంట్ అయిపోతే, మరి కొందరు నేతలు పార్టీ మారిపోయారు. ఇప్పటికీ జగన్ దెబ్బకు నాయకులు బయటకొచ్చి టీడీపీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేయడం లేదు. చంద్రబాబుకు సపోర్ట్‌గా ఉండటం లేదు. కానీ కొందరు నాయకులు మాత్రం నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టి, టీడీపీని గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అలా పార్టీ గెలుపు కోసం కష్టపడుతున్న నాయకుల్లో ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే, ఏలూరు పార్లమెంట్ అధ్యక్షుడు గన్నీ వీరాంజనేయులు ముందు వరుసలో ఉన్నారని చెప్పొచ్చు.


తనకు ఏలూరు పార్లమెంట్ అధ్యక్షుడు పదవి వచ్చిన దగ్గర నుంచి గన్నీ, పార్లమెట్ పరిధిలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు, కైకలూరు నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో నూజివీడు, కైకలూరులు కృష్ణా జిల్లా పరిధిలో ఉండగా, మిగిలినవి పశ్చిమ గోదావరి పరిధిలో ఉన్నాయి.


ఇక పార్లమెంట్ అధ్యక్షుడుగా గన్నీ, ప్రతి నియోజకవర్గంలోని నాయకులతో సమావేశమై, పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. ఓ వైపు తన సొంత నియోజకవర్గం ఉంగుటూరులో పార్టీని నిలబెట్టేందుకు కష్టపడుతున్నారు. అలాగే మిగిలిన నియోజకవర్గాల్లో వైసీపీకి ధీటుగా టీడీపీని స్ట్రాంగ్ చేయడానికి చూస్తున్నారు. పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయినా సరే, ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా పార్టీ తరుపున కష్టపడుతున్నారు.


అలాగే అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు సైతం బాగానే కష్టపడి, పార్టీని మెరుగైన స్థితిలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. దెందులూరులో చింతమనేని ప్రభాకర్ రెండేళ్లలో బాగా పుంజుకున్నారు. అటు ఏలూరులో బడేటి చంటి, పోలవరంలో బొరగం శ్రీనివాసరావులు బాగానే పనిచేస్తున్నారు. చింతలపూడి ఇన్‌చార్జ్ కర్రా రాజారావు ఇటీవలే మరణించారు. దీంతో అక్కడ మాజీ మంత్రి పీతల సుజాత పార్టీకి సపోర్ట్ ఉన్నారు. కైకలూరులో జయమంగళ వెంకటరమణ యాక్టివ్‌గానే ఉన్నారు. నూజివీడులో ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కాస్త సైలెంట్‌గా ఉన్నారు. కానీ మొత్తం మీద చూసుకున్నట్లైతే ఏలూరు పార్లమెంట్ పరిధిలో తమ్ముళ్ళు పార్టీని సెట్ చేస్తున్నారనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp

సంబంధిత వార్తలు: