చైనా వ్యాక్సిన్ కి మళ్ళీ షాక్.. అక్కడ కూడా బ్యాన్?

praveen
చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం పట్టిపీడిస్తోంది. ఇక ఈ వైరస్ కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ రూపాంతరం చెందుతున్న వైరస్ శరవేగంగా వ్యాప్తి జరుగుతోంది. అయితే వైరస్ కు పుట్టినిల్లు అయిన చైనా మాత్రం వైరస్ లేని దేశంగా మారిపోతుంది. అక్కడ దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య కేవలం సింగిల్ డిజిట్ లో మాత్రమే ఉంటున్నాయి. అయితే  కరోనా  కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న తరుణంలో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా శరవేగంగా కొనసాగుతోంది.


 ప్రస్తుతం ఎన్నో రకాల వ్యాక్సిన్లు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి.  ఈ క్రమంలోనే చైనా కూడా టీకాలు అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే మొదట్లో చైనా తీసుకువచ్చిన వ్యాక్సిన్ లను కొనుగోలు చేసేందుకు పలు దేశాలు ముందుకు వచ్చాయి. కానీ చైనా వ్యాక్సిన్ ద్వారా కలుగుతున్న దుష్ప్రభావాలు తెలిసిన తర్వాత చాలా దేశాలు చైనా వ్యాక్సిన్లను తిప్పి పంపించడమే కాదు చైనా వ్యాక్సిన్ పై నిషేధం కూడా విధించారు.  ఇప్పటికే పలు దేశాలు చైనా వ్యాక్సిన్పై ఇలాంటి తరహా ఆంక్షలు కొనసాగిస్తుండగా.. ఇక ఇప్పుడు మరో రెండు వేషాలు కూడా చైనాకు షాక్ ఇచ్చాయి.

 అరబ్ కంట్రీస్ లో ఇప్పటివరకు కేవలం దుబాయ్, బెహరిన్ దేశాలు మాత్రమే చైనా కు సంబంధించిన వ్యాక్సిన్ ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో కొద్దిరోజుల్లోనే చైనా కు సంబంధించిన వ్యాక్సిన్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినట్లు బహ్రయిన్ గుర్తించడంతో చివరికి చైనా వ్యాక్సిన్ పై నిషేధం విధించింది. ఇప్పుడు దుబాయ్ సైతం ఇలాంటి తరహా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక చైనా టీకా వేసుకున్నప్పటికీ ఎలాంటి ఉపయోగం లేదు అని భావించిన దుబాయ్ చైనా వ్యాక్సిన్ పై నిషేధం విధించింది. ఈ క్రమంలోనే దుబాయ్, బెహరన్ దేశాలు అమెరికాకు చెందిన పైజర్ సంస్థకు చెందిన వ్యాక్సిన్ కొనుగోలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: