అత్యధిక జనాభా ఉన్న 10 నగరాలు ఏమిటంటే..?

Suma Kallamadi
ప్రపంచ జనాభా అనేది కొన్ని దేశాల్లో అవధులు లేకుండా పెరిగిపోతూనే ఉంది. కానీ మరి కొద్ది దేశాల్లో మాత్రం జనాభా తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం 780 కోట్లు ఉన్న ప్రపంచ జనాభా 2100 నాటికి 880కోట్లకు పెరుగుతుందని నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం మన భారతదేశం అధిక జనాభా ఉన్న దేశాల్లో రెండో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే భవిష్యత్ లో మొదటి స్థానంలో ఉన్న చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా నిలుస్తుందని నివేదికలు చెప్తున్నాయి. 2047నాటికి 161 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. భారత్ తర్వాత అత్యధిక జనాభా గల దేశాలుగా చైనా, నైజీరియా, అమెరికా, పాకిస్తాన్ లు నిలుస్తాయి. అలాగే జపాన్, స్పెయిన్, ఇటలీ, థాయ్ లాండ్, దక్షిణ కొరియా, పోలాండ్,  పోర్చుగల్ లో జనాభా బాగా తగ్గిపోతుందని నివేదిక పేర్కొంది.


 అయితే తాజాగా మాక్రోట్రెండ్ అనే సర్వే సంస్థ ప్రస్తుతం ప్రపంచదేశాల్లో అత్యధిక జనాభా ఉన్న టాప్ 10 నగరాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ నుంచే రెండు నగరాలు ఉండడం గమనార్హం. మరి టాప్ 10 నగరాల జాబితాలో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దామా.! ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న నగరంగా జపాన్ లోని టోక్యో నంబర్ 1 స్థానంలో నిలిచింది. ఈ నగరంలో మూడు కోట్ల 73 లక్షలు మంది జీవిస్తుండడం విశేషంగా చెప్పొచ్చు. ఇక జపాన్ తర్వాత ప్రపంచంలోనే అత్యధిక మంది జీవిస్తున్న రెండో నగరం మన దేశ రాజధాని ఢిల్లీ అవటం ఇంకో విశేషం. ఢిల్లీలో 3 కోట్ల 11 లక్షలు మంది జనాభా జీవిస్తున్నారు.  



ఇక మూడో స్థానంలో చైనాలోని షాంఘై నగరం నిలిచింది. ఇక్కడ రెండు కోట్ల 77 లక్షల మంది జీవిస్తున్నారు. ఇక ప్రపంచంలోనే 4వ నగరంగా బ్రెజిల్ లోని సావ్ పోలో నగరం నిలిచింది. ఇక్కడ రెండు కోట్ల 22 లక్షల మంది జీవిస్తున్నారు. ఆ తర్వాత వరుసగా 5వ స్థానంలో మెక్సికోలోని మెక్సికో సిటీ, 6వ స్థానంలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా, 7వ స్థానంలో ఈజిప్ట్ లోని కైరో నగరం, 8వ స్థానంలో చైనా రాజధాని బీజింగ్ ఉన్నాయి. ఇకపోతే మన భారత దేశంలోని ముంబై నగరం 9వ స్థానంలో నిలిచింది. ముంబై నగరంలో మొత్తం 2 కోట్ల 66 లక్షల మంది జనాభా ఉన్నారు. ఇక 10వ స్థానంలో జపాన్ లోని ఒసాకా నగరం నిలిచింది. ఇక్కడ ఒక koti reddy SARIPALLI' target='_blank' title='కోటి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">కోటి 91 లక్షల మంది జీవిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: