జ‌గ‌న్ బాట‌లోనే కేంద్రం.. లోకేష్ బ‌తికుండ‌గా జ‌గ‌న్ ను ఓడించ‌లేరు :కొడాలి నాని

మంత్రి కొడాలి నాని టీడీపీ అధినేత చంద్ర‌బాబు పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సీఎం జ‌గ‌న్ రెండేళ్ల పాల‌న పూర్తిచేసుకున్న సంద‌ర్భంగా నాని మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశంలో నాని మాట్లాడుతూ...2014 లో చంద్ర‌బాబుకు అధికారం ఇచ్చి ప్ర‌జ‌లు త‌ప్పు చేశామ‌ని భావిస్తున్నార‌న్నారు. జ‌గ‌న్ పాల‌న చూసాక 2014లోనే అధికారం ఇస్తే భాగుండేద‌ని అనుకుంటున్నార‌ని అన్నారు. బాబు కు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని కుక్క‌లు చింపిన విస్త‌రిలా మార్చార‌ని ఫైర్ అయ్యారు. ఏపీ సీఎం జ‌గ‌న్ బాట‌లోనే కేంద్ర‌ప్ర‌భుత్వం న‌డుస్తుంద‌ని జ‌గ‌న్ కొనియాడారు. క‌రోనాతో అనాథ‌లైన పిల్ల‌ల‌కు రూ.10ల‌క్ష‌ల ఎక్స్ గ్రేషియా డిపాజిట్ చేశామ‌ని అన్నారు. దేశానికే ఆద‌ర్శ‌వంతమైన పాల‌న చేసే అదృష్టం జ‌గ‌న్ కు ద‌క్కింద‌న్నారు. ఎన్నిక‌ల్లో గెలిచేందుకు చంద్ర‌బాబు అడ్డ‌మైన హామీల‌ను ఇచ్చార‌ని...కానీ జ‌గ‌న్ కుల మ‌తాల‌కు అతీతంగా హామీలిచ్చార‌ని చెప్పారు. రెండేళ్ల‌లో పెద్ద ఎత్తున సంక్షేమ‌ప‌థ‌కాల‌ను అమ‌లు చేశామ‌ని నాని అన్నారు.
ప‌థ‌కాల ద్వారా రూ.లక్షా 31 వేల కోట్లను ప్ర‌జ‌ల‌కు అంద‌జేశామ‌ని చెప్పారు. ఎన్టీఆర్ కు భార‌త ర‌త్న రాకుండా ఆపిన దుర్మార్గుడు చంద్ర‌బాబే అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న‌ సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక.. జూమ్ నుంచి పప్పునాయుడు, తుప్పునాయుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 2004, 2009లో వైఎస్ఆర్ తుక్కునాయుడుని వైఎస్ఆర్ తుక్కుతుక్కుగా ఓడించారని మండి ప‌డ్డారు. అసెంబ్లీ గేటు తాక‌కుండా పప్పునాయుడిని ప్ర‌జ‌లు ఓడించార‌ని అన్నారు. 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ను ప్ర‌జ‌లు భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించారని చెప్పారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వాళ్లు వారసులు అంటున్నారని... వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబు సీఎం అయ్యారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.
కానీ ప్ర‌జ‌ల మ‌ద్ద‌తుతో గెలిచిన జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు సంక్షేమ కార్య‌క్రమాల ద్వారా మంచి చేస్తున్నార‌ని అన్నారు. జ‌గ‌న్ మంచి చేస్తుంటే ప‌క్క‌రాష్ట్రం నుండి జూమ్ ద్వారా త‌ప్పుడు రాజ‌కీయాలు చేస్తున్న చంద్ర‌బాబు, లోకేష్ ను రాజ‌కీయ స‌మాధి చేయాల‌ని అన్నారు. లోకేష్ బ‌తికుండా జ‌గ‌న్ ను సీఎం కుర్చీ నుండి దించ‌లేర‌ని మండిప‌డ్డారు. జ‌గ‌న్ కు ప్ర‌జ‌ల ఆశీస్సులు ఉన్నాయ‌ని ..దేశంలోని అన్ని పార్టీల‌ను క‌లుపుకుని వ‌చ్చినా చంద్ర‌బాబు మ‌ళ్లీ గెల‌వ‌లేడ‌ని అన్నారు. చంద్ర‌బాబు ఎన్ని కుయుక్తులు ప‌న్నినా ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌ని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: