నానీపై ఉమా మళ్ళీ విసుర్లు... నానీ రియాక్షన్ ఏంటో...?

Gullapally Rajesh
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల విషయంలో అధికార పార్టీ నాయకులు దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. అందులో ప్రధానంగా మంత్రి కొడాలి నానీ ముందు వరుసలో ఉంటారు. ఇక మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విషయంలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఇక తాజాగా దేవినేని ఉమా మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసారు. ధాన్యపు రైతులను ఆదుకోవడానికి ఈప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? అని ఆయన నిలదీశారు. తడిచిన ధాన్యం కళ్లాల్లో మగ్గిపోతుంటే, ముఖ్యమంత్రికి, వ్యవసాయమంత్రికి కనిపించడం లేదా? అని నిలదీశారు.
బూతుల మంత్రి ధాన్యం కొనుగోళ్లకు ఏవో టోకెన్లు ఇచ్చామంటున్నాడు అని  ఎవరికి ఎప్పుడు, ఎన్ని ఇచ్చాడో ఆయనే చెప్పాలి అని డిమాండ్ చేసారు. ముఖ్యమంత్రి చెప్పిన రూ.3వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైంది?అని నిలదీశారు. ధాన్యపు రైతుల , బాధలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాడని చెప్పి, టీ.ఎన్.ఎస్.ఎఫ్ నేత దొండపాటి విజయ కుమార్ ను అరెస్ట్ చేస్తారా?  అని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం విజయ్ ని విడుదల చేయాలి అని డిమాండ్ చేసారు. ధాన్యం కొనుగోళ్ల ముసుగులో వైసీపీనేతలు, దళారులు, మిల్లర్లతో కలిసి రైతులను దోచుకుంటున్నారు అని మండిపడ్డారు.
తరుగు, తేమ పేరుతో రూ.1450కు కొనాల్సిన బస్తాను రూ.850కు కొంటున్నారు అన్నారు బస్తాకు పదికిలోల తరుగు తీసేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. ధాన్యం రైతులు సహా, వివిథ రకాల రైతుల నుంచి దోచేసిందంతా తాడేపల్లి ప్యాలెస్ కే  చేరుతోంది అని మండిపడ్డారు. ఈ ప్రభుత్వంలో రైతులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు ఎవరూసంతోషంగా లేరు అని ఆయన ఆరోపించారు. ఒకరు జైలు నుంచి బయటకు రాగానే మరొకరిని లోపలికి పంపడమే ముఖ్యమంత్రి పనిగా పెట్టుకున్నాడు అన్నారు. ధూళిపాళ్ల నరేంద్రకు బెయిల్ రాగానే దొండపాటి విజయ్ ను అరెస్ట్ చేశారు అని అన్నారు. ముఖ్యమంత్రి తక్షణమే రాజప్రాసాదం నుంచి బయటకు వచ్చి,ధాన్యపు రైతుల కష్టాలపై స్పందించాలి అని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: