నియోజకవర్గం కోసం వంశీ కష్టాలు...!

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ మధ్య కాలంలో కాస్త సైలెంట్ గా కనపడుతున్న సరే నియోజకవర్గం విషయంలో మాత్రం ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులను తన నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ఇబ్బంది పెట్టాలి అని భావిస్తున్న సరే ఆయన చాలా జాగ్రత్తగా ముందుకు వెళుతూ  నియోజకవర్గంలో ఉన్న దారుణమైన పరిస్థితులకు సంబంధించి పరిస్థితిని చక్కదిద్దే విధంగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన నియోజకవర్గంలో తన సన్నిహితుల ద్వారా ఎప్పటికప్పుడు గ్రామాల్లో ఉన్న పరిస్థితి అదే విధంగా ఆస్పత్రిలో ఉన్న పరిస్థితులు తెలుసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వాటిని పరిష్కరించుకునే విధంగాఅడుగులు వేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నియోజకవర్గంలో వైద్య సేవలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం కావాల్సిన అవసరం ఉంది. అందుకే వల్లభనేని వంశీ దానికి సంబంధించి ఎక్కువగా దృష్టి సారించారని త్వరలోనే ముఖ్యమంత్రి జగన్ తో కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయని మంత్రి కొడాలి నాని నుంచి కూడా ఆయన పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు తీసుకుని ముందుకు వెళుతున్నారని అంటున్నారు. ప్రభుత్వ పెద్దలనుంచి కొంతవరకు సహకారం లేకపోయినా సరే సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు.
గన్నవరం నియోజకవర్గంలో పరిస్థితులు కాస్త మెరుగ్గా కనబడుతున్నాయి. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలకు సంబంధించి కూడా ఆయన ఎక్కువగా దృష్టి సారించారు. వైద్య సేవలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనే భావనలో కూడా ఉన్నారు. అందుకే ఆక్సిజన్ సిలిండర్ లకు సంబంధించి అవసరమైతే సొంత డబ్బులు ఖర్చు చేసే విధంగా వల్లభనేని వంశీ అడుగులు వేస్తున్నారని... నియోజకవర్గంలో బలంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ఇప్పుడు అవసరం అయితే కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులు పడేవారికి ఆర్థిక సహాయం కూడా చేసే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: