పిల్లల్లో ఆటిజానికి తల్లి తండ్రులు కూడా కారణం అంటున్న శ్రీజా సరిపల్లి... ఇస్తున్న సలహా ఏంటీ...?

ఆటిజం... ఈ రోజుల్లో మనం ఈ సమస్య గురించి ఎక్కువగా వింటున్నాం. పిల్లలు ఈ వ్యాధి బారిన పడటం, ఈ వ్యాధి నుంచి బయటకు తీసుకురావడానికి తల్లి తండ్రులు ఎన్నో సమస్యలు ఎదుర్కోవడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం. ఇక దీనికి వైద్యం కూడా పూర్తి స్థాయిలో లేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ వ్యాధి పిల్లల్లో ఎక్కువగా కనపడుతుంది. ముఖ్యంగా మగ పిల్లల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి నుంచి బయటకు రావడానికి పిల్లలకు కొన్ని సంస్థలు సహాయ పడుతున్నాయి.
అందులో పినాకిల్ బ్లూమ్స్ ముందు వరుసలో ఉంది. కోటీ గ్రూప్ లో భాగమైన పినాకిల్ బ్లూమ్స్ ని శ్రీజ సరిపల్లి సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె పిల్లలు ఎదుర్కొనే ఈ సమస్య గురించి తల్లి తండ్రులకు ధైర్యం చెప్తూ తన ఆస్పత్రిలో చికిత్స తీసుకునే వారికి అండగా నిలుస్తున్నారు. అయితే ఈ వ్యాధి రావడానికి తల్లి తండ్రులు కూడా ఒక కారణం అని చెప్తున్నారు శ్రీజ. దీనిని ఒకప్పుడు బుద్ధిమాంధ్యం వ్యాధి అని పిలిచే వారు. మెదడు సరిగా వృద్ధి చెందకపోవడంతో ఈ వ్యాధి వస్తుంది.
తల్లి గర్భిణిగా ఉన్న సమయంలో ఏదైనా మానసిక ఒత్తిడికి తీవ్రంగా గురైఅనా సరే లేక వైరల్‌ ఇనఫెక్షన్ల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొన్నా లేక మెదడుకి ఆక్సీజన్ అందకపోయినా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని ఆమె చెప్తున్నారు. అదే విధంగా పిల్లలు పుట్టిన తర్వాత ఎదిగే క్రమంలో తల్లి తండ్రులు ఉద్యోగాలు, వ్యాపారాలు, లేదా వ్యక్తిగత సమస్యలతో పిల్లలతో ఎక్కువగా సమయం గడకపోవడంతో ఈ సమస్య ఎక్కువగా వస్తుందని కాబట్టి తల్లి తండ్రులు పిల్లల మీద ఎక్కువగా శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉందని శ్రీజ సూచనలు చేస్తున్నారు. పిల్లల మీద వయసుకి మించిన భారం కూడా పెట్టవద్దని ఆమె కోరుతున్నారు.
" >


" >


" >


" >


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: