శ్రీజారెడ్డి: ఓ తల్లి విజయం.. వేల తల్లులకు అద్భుత వరం..?

Chakravarthi Kalyan
అనుకోని కష్టం వస్తే ఎవరైనా కుంగిపోతారు.. ఆ కష్టం నుంచి ఎలా గట్టెక్కాలా అని ఆలోచిస్తారు. అందుకోసం ఎన్నో మార్గాలు వెదుకుతారు. ఆ కష్టం నుంచి బయటపడిన తర్వాత.. తమ ఆవేదన మరచిపోతారు.. హమ్మయ్య బయటపడ్డామని ఊరట చెందుతారు. అయితే ఆ తర్వాత ఆ విషయం పూర్తిగా మరిచిపోయి తమ రొటీన్ లైఫ్‌లో పడిపోతారు. కానీ.. కొందరు మాత్రం.. అలా సమస్య నుంచి తాను గట్టెక్కాను కదా అని అక్కడితో ఆగిపోరు.. అసలు అలాంటి కష్టం ఎవరికైనా ఎందుకు రావాలని ఆలోచిస్తారు.
అసలు సమస్యకే పరిష్కార మార్గంగా మారిపోతారు. తాను పడిన కష్టం ఇంకెవ్వరూ పడకూడదని తపన చెందుతారు. అలాంటి అరుదైన వ్యక్తుల పరిశ్రమే.. వేల మందికి ఊరట ఇస్తుంది. వారిని ఆ కష్టం నుంచి బయటపడేస్తుంది. ఇదిగో ఈ రెండో కోవకు చెందిన వ్యక్తే శ్రీజారెడ్డి సరిపల్లి. ఆమెకు ఓ కష్టం వచ్చింది. ఆమె బిడ్డ ఆటిజం వంటి సమస్య ఎదుర్కొన్నాడు. బిడ్డ పుట్టిన ఆనందం ఈ ఆటిజం సమస్యతో ఆవిరైంది. అయితే ఆ బిడ్డకు చికిత్స కోసం ఆమె పడిన వేదన అంతా ఇంతా కాదు.
ఆటిజం పిల్లలకు సరైన చికిత్స ఇచ్చే ఆసుపత్రులే లేవు. వారి అవసరాలకు అనుగుణంగా చికిత్స విధానాలే లేవు. అప్పుడే ఆమె పిల్లల్లోని ఈ ఆటిజం వంటి సమస్యలపై దృష్టి సారించారు. ఎంతో పరిశోధన చేశారు. చికిత్స పద్దతులను అధ్యయనం చేశారు. అయితే అదృష్టవశాత్తూ శ్రీజారెడ్డి బిడ్డకు అసలు సమస్య ఆటిజం కాదని తేలింది. బిడ్డ క్రమంగా కోలుకున్నాడు. కానీ శ్రీజారెడ్డి మాత్రం ఆటిజం పిల్లల గురించి ఆలోచించడం మానలేదు. ఆమె అధ్యయనం, పరిశోధన నుంచి పుట్టిందే పినాకిల్ బ్లూమ్స్ సంస్థ.
పినాకిల్ బ్లూమ్స్.. ఈ సంస్థ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మ‌న దేశంలోనే కాకుండా.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఆటిజం చిన్నారుల పాలిట వ‌రంగా మారింది. కొడిగ‌డ‌తాయ‌నుకున్న జీవితాల్లో వెలుగులు ప్రసాదించింది. బుద్ధి మాంద్యంతో ఇబ్బంది ప‌డుతున్న చిన్నారులు నేడుప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లలో సంఖ్యలో ఉన్నారు. వీరికి ఇప్పుడు ఏకైక గ‌మ్య స్థానం.. శ్రీజారెడ్డి సత్సంక‌ల్పంతో ప్రారంభించి పినాకిల్ బూమ్స్‌. ఆటిజం మందుల ద్వారా న‌యం అయ్యేది కాదు. ఆటిజంతో ఇబ్బంది ప‌డే చిన్నారుల‌కు పినాకిల్ బ్లూమ్స్‌లో వివిధ రూపాల్లో సేవ‌లు అందిస్తున్నారు. అలా శ్రీజారెడ్డి స్థాపించిన సంస్థ పినాకిల్ బూమ్స్ ఓ తల్లి విజయం.. అంతకుమించి వేల తల్లులకు అద్భుత వరం.

" >

 
" >

" >


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: