హ్యాపీ బర్త్‌డే : శ్రీజా మేడమ్.. వేల ఆటిజం పిల్లల పాలిట దైవమ్..!

Chakravarthi Kalyan
ఇంట్లో ఓ బుజ్జాయి ఉంటే ఆ సందడే వేరు. అందుకేనేమో మన దేశంలో పెళ్లయిన నాలుగైదు నెలలకే అంతా ఏమైనా విశేషమా అంటూ కొత్త దంపతులను ఆరా తీస్తుంటారు. అవును మరి.. అది పూరిల్లైనా.. పెంకుటిల్లైనా.. డాబా అయినా ఇంద్రభవనమైనా.. ఆ ఇంట్లో చిన్నారుల సందడి లేకపోతే.. ఆ ఇంటికి జీవకళే ఉండదు. ఇంట్లో ఎంత ఖరీదైన వస్తువులున్నా.. అట్టహాసాలు ఆడంబరాలు ఉన్నా.. ఆ ఇంట పసివాడి బోసినవ్వులు విరబూయకపోతే.. ఆ ఇంటికి పరిపూర్ణత చేకూరదు.
అందుకే అసలు కంటే వడ్డీ ముద్దు అంటూ చిన్నారులను ముద్దు చేస్తారు. మరి అలాంటి చిన్నారుల్లో ఏదైనా లోపం ఉంటే.. ఆ తల్లిదండ్రుల ఆవేదనకు అంతు ఉండదు. కొందరు చిన్నారులకు బుద్ధి మాంద్యం ఉంటుంది. ఇంకొందరు బుజ్జాయిలకు ఏళ్లు గడుస్తున్నా మాటలు రావు.. ఇంకొందరు తమ బాధలను చెప్పుకునే తెలివితేటలు ఉండవు. మరికొందరికి ఆటిజం సమస్య ఉంటుంది. ఇంకా ఇలాంటి చిన్నారుల రుగ్మతలు ఎన్నో. ఇలాంటి వారిని చూస్తే ఆ తల్లిదండ్రుల ఆవేదనకు అంతే ఉండదు.
అలాంటి వేల మంది ఆటిజం పిల్లల పాలిట దైవంగా మారారు శ్రీజ సరిపల్లి. ఆమె ఆటిజం పిల్లలకు చికిత్స అందించే పినాకిల్ బ్లూమ్స్ సీఈవో. హైదరాబాద్, విజయవాడ సహా అనేక ప్రాంతాల్లో ఈ పినాకిల్ బ్లూమ్స్ సేవలందిస్తోంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఆటిజంపై అవగాహన చాలా తక్కువ. అలాంటి బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలకు పూర్తి స్థాయిలో చికిత్స అందించే సంస్థలు లేవన్న సంగతి శ్రీజా సరిపల్లికి స్వానుభవం మీద తెలిసింది. ఎందుకంటే ఆమె బిడ్డ కూడా తొలిరోజుల్లో ఇలాగే ఆటిజం వంటి సమస్యతో బాధపడ్డారు.
శ్రీజ సరిపల్లి తమ బిడ్డకు చికిత్స కోసం అనేక ఆసుపత్రులు తిరిగినా ఎక్కడా సంతృప్తికరమైన సేవలు లభించలేదు. అప్పుడే ఆమె పినాకిల్ బ్లూమ్స్ స్థాపించాలని నిర్ణయించుకున్నారు. ఈ అంశంపై ఏళ్ల తరబడి పరిశోధన చేసి పినాకిల్ బ్లూమ్స్ స్థాపించారు. ఇప్పుడు ఈ పినాకిల్ బ్లూమ్స్ వేలమంది ఆటిజం పిల్లలు, వారి తల్లిదండ్రుల్లో నవ్వులు విరబూయిస్తోంది. అలాంటి శ్రీజ సరిపల్లి పుట్టినరోజు ఇవాళ..  అందుకే అంటున్నామ్.. శ్రీజా మేడమ్.. వేల ఆటిజం పిల్లల పాలిట దైవమ్..! హ్యాపీ బర్త్‌ డే టూ యూ..!


" >

" >

" >


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: