వాళ్ళకు జగన్ ఫోన్ చేస్తారా...? కెసిఆర్ వస్తారా...?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలబడే అవకాశం ఉంది. ఇప్పటికే కేసీఆర్ దూకుడుతో భారతీయ జనతాపార్టీ కూడా ఇబ్బంది పడుతుందనే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా సీఎం కేసీఆర్ కొన్ని కొన్ని అంశాల్లో భారతీయ జనతా పార్టీ ని టార్గెట్ చేయడానికి అన్ని విధాలుగా కూడా రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. భారతీయ జనతా పార్టీ పెద్దలను సీఎం కేసీఆర్ ఇబ్బంది పెట్టే విధంగా రాజకీయం చేయడానికి సిద్ధమవుతున్నారు.
ఈ నేపథ్యంలోనే నాగార్జునసాగర్ ఎన్నికలు పూర్తయిన తర్వాత విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో ఒక కీలక నిర్ణయాన్ని కూడా సీఎం కేసీఆర్ ప్రకటించే అవకాశాలున్నాయి. టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యమంలో సీఎం కేసీఆర్ కూడా పాల్గొనే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఎంపీలతో కలిసి మంత్రి కేటీఆర్ కూడా వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. శాసన మండలి పక్ష నేత అలాగే పార్లమెంటరీ పక్ష నేత రాజ్యసభ పక్ష నేత అందరూ కూడా వెళ్లి విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.
 ఈ విషయంలో సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి జగన్ తో మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. తిరుపతి ఉప ఎన్నిక అయిన తర్వాత విశాఖలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి వైసీపీ నేతలు సిద్ధమవుతున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈ కార్యక్రమానికి కొంతమంది కీలక నేతలు ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నారు. దక్షిణాది నుంచి కూడా కొంతమంది నేతలకు ఆహ్వానం పలికే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి వైయస్ జగన్ స్వయంగా ఫోన్ చేసి కొంత మందిని ఆహ్వానించడానికి సిద్ధమవుతున్నారు. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా సీఎం జగన్ ఫోన్ చేసే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: