కోడెల వారసుడు సెట్ చేసుకున్నట్లేనా?

M N Amaleswara rao
కోడెల శివప్రసాద్....ఏపీ రాజకీయాల్లో తిరుగులేని నాయకుడు. పల్నాడు ప్రాంతానికి దశాబ్దాల పాటు సేవ చేసిన నాయకుడు. ఐదు సార్లు నరసారావుపేట నుంచి ఒకసారి సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యే గా గెలిచిన కోడెల, నవ్యాంధ్ర తొలి స్పీకర్‌గా పనిచేశారు. ఇక 2019 ఎన్నికల్లో ఓడిపోయిన కోడెల మీద అనేక ఆరోపణలు రావడంతో, ఆత్మహత్య చేసుకుని తనువు చాలించిన విషయం అందరికీ తెలిసిందే.
అయితే కోడెల చనిపోయాక సత్తెనపల్లికి సరైన నాయకుడు లేకుండా పోయారు. సత్తెనపల్లి సీటు కోసం మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు రంగబాబు గట్టిగానే ట్రై చేశారు. ఇక కోడెల తనయుడు శివరాం కూడా సత్తెనపల్లిలో యాక్టివ్ గా పనిచేయడం మొదలుపెట్టారు. గత కొన్ని నెలల నుంచి శివరాం సత్తెనపల్లిలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇటీవల జరిగిన పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్ధులని నిలబెట్టారు.
కాకపోతే వైసీపీ హవాలో టీడీపీ నేతలు ఘోరంగానే ఓడిపోయారు. సత్తెనపల్లి మున్సిపాలిటీలో కూడా టీడీపీ ఓడిపోయింది. ఇక ఓటమి పాలయ్యాక శివరాం పార్టీలో కనిపించడం తగ్గించేశారు. దీంతో సత్తెనపల్లి టీడీపీ కేడర్ కాస్త అయోమయంలో పడింది. ఇటు రంగబాబుకు కూడా ఛాన్స్ రావడం లేదు. అయితే సత్తెనపల్లి కోడెల వారసుడుకు ఫిక్స్ అయినట్లే అని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి టీడీపీ అభ్యర్ధిగా ఆయనే నిలబెడతారని కోడెల వర్గం చెబుతోంది.
సత్తెనపల్లిలో అంబటి రాంబాబు బలంగా ఉన్నారు. అలాగే పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులని పెద్ద సంఖ్యలోనే గెలిపించుకున్నారు. ఇలా బలంగా ఉన్న అంబటిని ఢీకొట్టడం కోడెల వారసుడుకు అవుతుందా అనేది కాస్త డౌట్ గానే ఉంది. అయితే ఎన్నికల నాటికి ఉండే పరిస్థితులని బట్టి అభ్యర్ధిని నిర్ణయిస్తారా? లేక కోడెల వారసుడుని ముందుగానే ఫిక్స్ చేస్తారా?అది కాదంటే రాయపాటి రంగబాబుని బరిలో నిలుపుతారా? అనేది రాబోయే రోజుల్లో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: