చింత చిగురుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!?

N.ANJI
తెలుగు రాష్ట్రాల్లో చింత చిగురు కూరకు ఎంత స్పెషల్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక చింత చిగురు సీజనల్ టైములో మాత్రమే దొరుకుతుంది. అయితే చింత చిగురు తినడం వలన ఆరోగ్యానికి చాల మంచిది అని వైద్య నిపుణులు చెబుతున్నారు. చింత చిగురులో ఎక్కువగా వున్న ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అదే సమయంలో మంచి కొలెస్ట రాల్‌ను పెంచుతుంది.
ఇక చింత చిగురులో ఉన్న యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలున్నాయి. దీంతో చిగురును ఉడికించి నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు తగ్గుతాయి. చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇది సహజ సిద్ధమైన లాక్సేటివ్గా పనిచేసి విరేచనం సులభంగా అయ్యేలా చేస్తుంది. మలబద్దకం సమస్య తొలగిపోతుంది. చింత చిగురు పైల్స్ ఉన్న వారికి నివారణగా ఉపయోగపడుతుంది. అంతేకాక వైరల్ ఇన్ఫెక్షన్లతో వచ్చే జ్వరాన్ని చింత చిగురు తగ్గిస్తుంది. నోటి పూత కు చింత చిగురు నివారిణిగా పనిచేస్తుంది. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది.
చింత చిగురు శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కడుపులో నులి పురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురు మంచి ఔషధంగా పనిచేస్తుంది. జీర్ణాశయ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. చింత చిగురులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తరచూ చింత చిగురును తింటే ఎముకలు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి.
ఇక థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారు చింత చిగురును తమ ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. షుగర్ వ్యాధి గ్రస్తులు చింత చిగురు తింటే రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. చింత చిగురును ముద్దగా దంచి కీళ్లపై ఉంచితే నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. ఆర్థరైటిస్ సమస్యతో బాధ పడుతున్న వారికి చింతచిగురు మేలు చేస్తుంది. కంటి సంబంధ సమస్యలను కూడా చింత చిగురు దూరం చేస్తుంది. కళ్లు దురదగా ఉన్నప్పుడు కొంత చింత చిగురు తింటే ఉపశమనం కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: