చైనా సంచలన ప్రకటన వెనుక.. అసలు నిజం ఇదే..?

Chakravarthi Kalyan
చైనా ప్రభుత్వం తాజాగా ఓ సంచలన ప్రకటన చేసింది. తమ దేశం పేదరికాన్ని జయించినట్టు ప్రకటించింది. తమ దేశంలో కడు పేదలు ఎవరూ లేరని అధ్యక్షుడు షీ జిన్‌ పింగ్‌ అధికారికంగా ప్రకటించారు. పేదరికంపై చైనా సంపూర్ణ విజయం సాధించినట్లు జిన్‌పింగ్‌  ఘనంగా ప్రకటించారు. చైనా నుంచి పేదరికాన్ని పారద్రోలేందుకు సహకరించిన 1,981 మందికి, 1,501 సంస్థలకు ఆయన రిప్రజెంటేటీవ్స్‌ ఆఫ్‌ నేషనల్‌ హానరీ సర్టిఫికెట్లు ఇచ్చారు. చైనా కమ్యూనిస్టు పార్టీ అవతరించి మరో నాలుగు నెలల్లో వందేళ్లు పూర్తవుతున్న సమయంలో చైనా ఈ ప్రకటన చేసింది.
అయితే చైనా చెబుతున్న దంతా నిజమేనా.. అన్న సందేహాలు ప్రపంచ దేశాలను వేధిస్తోంది. ఎందుకంటే చైనా ఎప్పుడూ నిజాలను చెప్పదు కదా. కరోనా విషయంలో ఎన్ని అబద్దాలు ఆడిందో అందరికీ తెలిసిందే. మరి ఈ ప్రకటన లో నిజం ఎంత అన్న విశ్లేషణలు మొదలయ్యాయి. ఇక్కడ ఓ విషయం గమనించాలి.  చైనా పేదరికాన్ని జయించానని చెప్పింది.. కానీ అసలు చైనాలో పేదరికం అంటే ఏంటో ఆలోచించాలి. చైనాలో రోజువారీ ఆదాయం 2.30డాలర్ల కంటే తక్కువ ఉన్న వారిని చైనాలో దారిద్ర్య రేఖకు కింద ఉన్నట్లు భావిస్తారు.
కానీ మిగిలిన ప్రపంచం దృష్టిలో పేదరికం నిర్వచనం వేరు.  అత్యధిక ఆదాయం ఉన్న దేశాలకు  ప్రపంచ బ్యాంక్‌ నిర్దేశించిన రోజువారీ ఆదాయ ప్రామాణిక మొత్తం 5.50 డాలర్లు. చైనా చెబుతున్న లెక్కతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. పేద దేశాలకు ప్రపంచ  బ్యాంక్‌ సూచించిన 1.90 డాలర్ల రోజువారీ ఆదాయం కంటే మాత్రం కొంచెం ఎక్కువే. చైనాది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అలాంటప్పడు చైనా పేదరికంగా లెక్కేయాల్సిన సగటు ఆదాయం 5.50 డాలర్లుగా ఉండాలి.
కానీ చైనా మాత్రం 2.30డాలర్ల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే చాలు.. వారు పేదరికం జయించినట్టే. అంతే కాదు.. చైనాలో పేదరిక నిర్మూలన ఉద్యమంలో వేలకొద్దీ అక్రమాలు జరిగినట్లు కేసులు కూడా నమోదయ్యాయి. కొన్ని ప్రపంచ స్థాయి సంస్థల లెక్కల ప్రకారం ఇప్పటికీ చైనాలో 13శాతం మంది పేదరికం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: