జగడ్డ: నిమ్మగడ్డ తీరుపై అంబటి ఫైర్..అదే జరిగితే ఊరుకోం?

Satvika
ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల వేడి కొనసాగుతుంది.. నామినేషన్లు పూర్తయిన కూడా కొన్ని ప్రాంతాల్లో రచ్చ లు జరుగుతున్నాయి.నిమ్మగడ్డ తీరుపై కొందరు నేతలు కార్యకర్తలు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఆయన ప్రవర్తన కోటలు దాటుందని అందరూ అంటున్నారు. నిమ్మగడ్డ ప్రవర్తన సరిగ్గా లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు హెచ్చరించారు.పంచాయతీ ఎన్నికల్లో రాజ్యాంగానికి, చట్టానికి వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా, అక్రమాలకు పాల్పడినా, గీతదాటి ఏకపక్షంగా వ్యవహరించే వారు ఎంతటివారైనా చర్యలు తప్పవని అన్నారు.



మొదటి విడత పంచాయితీ ఎన్నికల్లో కొన్ని ఏకగ్రీవాలు జరిగాయి. రెండో, మూడో విడత ఎన్నికలు ఇంకా జరగాల్సి ఉంది. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం చిత్రవిచిత్రమైన కార్యక్రమాలు చేస్తోంది. ప్రత్యేకించి కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్ చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. సుప్రీంకోర్టు ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఎస్‌ఈసీకి అతీతమైన శక్తులు వచ్చినట్లు తనకు తిరుగులేదన్నట్లు, తాను ఏది చేసినా చెల్లుతుందన్నట్టు రాజ్యాంగ వ్యతిరేకంగా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్ ప్రవర్తిస్తున్న తీరు ఉంది..



ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నాటి నుంచి తనకేదో అతీతమైన శక్తి వచ్చినట్లుగా, ఈ ప్రపంచంలో తానొక అద్భుతమైన శక్తిలా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై కక్షతో టీడీపీ, వారి మిత్రపక్షాలకు లాభం చేయాలన్నట్లుగా నిమ్మగడ్డ ప్రవర్తిస్తున్నారన్నారు. పార్టీ రహిత ఎన్నికల్లో మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబుపై ఫిర్యాదు చేస్తే ఏం చర్యలు తీసుకున్నారని.. అలాగే, ఈ-వాచ్‌ యాప్‌ను సెక్యూరిటీ సర్టిఫికేట్‌ లేకుండా ఎలా విడుదల చేశారని అంబటి ప్రశ్నించారు. ఇకపోతే గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ గా ఏకగ్రీవాలు జరగడం ఓర్వలేని నిమ్మగడ్డ వాటిని ఆపేశారు. ఎన్నడైనా ఇలాంటి ఘటన చూడలేదు. అధికార దుర్వినియోగం చేస్తున్న అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిమ్మగడ్డ, చంద్ర బాబు ఎంత ప్రయత్నించినా కూడా వైసీపీ గెలుపు ఖాయం అని అంబటి పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: