జగడ్డ : నిమ్మగడ్డను వదలని వైసీపీ నేతలు..వరుస విమర్శలు !!

KISHORE
ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కు వైసీపీ నేతలకు మద్య మాటల తూటాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అటు నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఇటు ప్రభుత్వ మంత్రులు వరుస మీడియా సమావేశాలతో ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూనే ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇటీవల లేవనెత్తిన ఏకగ్రీవలపై నిమ్మగడ్డ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. ప్రభుత్వం ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం రాజ్యంగా విరుద్దం అని జగనోరి పై మండి పడ్డారు. దీనికి కౌంటర్ గా వైసీపీ నేతలు నిమ్మగడ్డ చంద్ర బాబు తొత్తు అని, ఎన్నికల కమిషనర్ ప్రభుత్వ అధికారిలా ప్రవర్తించడంలేదని ఆ పదవికి అర్హుడు కాదని వ్యాఖ్యానిస్తున్నారు.
 ఇదిలా ఉండగా  తాజాగా నిమ్మగడ్డపై ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఫైర్‌ అయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఒక అభ్యర్థి భర్త మరణిస్తే… అక్కడకు నిమ్మగడ్డ వెళ్లడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. నారా లోకేశ్ కు నిమ్మగడ్డ పైలట్ గా వెళ్లారా? అంటూ ఎద్దేవా రాంబాబు ఎద్దేవా చేశారు. ఏకగ్రీవాలు తప్పు అని చెప్పిన ఎన్నికల కమిషనర్ శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడి బలవంతపు ఏకగ్రీవంపై ఎందుకు ప్రశ్నించడం లేదని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఈసీ విడుదల చేసిన ఈ-యాప్ అంతా ఒక బూటకమని… టీడీపీ కార్యాలయంలో దాన్ని తయారు చేశారని ఆరోపించారు.
నిమ్మగడ్డ రాసిన లేఖలు టీడీపీ కార్యాలయంలో తయారయ్యాయనే విషయం బయటపడిందని.. ఈ యాప్‌ కూడా అక్కడే తయారైందనే నిజం వెలుగులోకి వస్తుందని చెప్పారు. చిన్న చిన్న సంఘటనలను పెద్ద రాద్దాంతం చేస్తున్నారని మండి పడ్డారు. పట్టాభిపై దాడి పేరుతో టీడీపీ కొత్త డ్రామాలు మొదలు పెట్టిందని అంబటి అన్నారు. చట్టానికి వ్యతిరేకంగా ఉంటే చంద్రబాబును సైతం అరెస్ట్ చేయాల్సిందేనని చెప్పారు. పట్టాభిపై దాడి జరిగిందని టీడీపీ హడావుడి చేస్తోందని… కానీ, పోలీసులకు దాడిపై ఫిర్యాదు మాత్రం చేయరని మండిపడ్డారు. ఏది ఏమైనప్పటికి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు, వైసీపీ నేతలకు మద్య వివాదం ఎప్పట్లో ఆగేలా కనిపించడం లేదు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: