జగడ్డ : నిమ్మగడ్డ ఒక్క బాణానికే వైసీపీ విలవిల...?

Satya
ఇపుడు ఏపీలో పంచయతీ పోరుకు తెరలేచింది. సుప్రీం కోర్టు వారి ఆదేశాలతో అటు ఎన్నికల సంఘం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా ఎన్నికల కోసం కలసి పనిచేయాల్సి ఉంది. కానీ కలహాల కాపురం మాదిరిగా కధ సాగుతోంది. ఈ నేపధ్యంలో ఫిబ్రవరి 21వ తేదీన జరిగే చివరి విడత ఎన్నిక దాకా అటూ ఇటూ కూడా  సహకారం తప్పనిసరిగా చేసుకోవాలి.
ఈ విషయంలో గవర్నర్ కూర్చుని మధ్యవర్తిత్వం నెరపినా కూడా కధ మామూలుగానే ఉంటోంది. ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్  కూడా చాలా వ్యూహాత్మకంగా కడప జిల్లా పర్యటనలో చేసిన కొన్ని కామెంట్స్ వైసీపీ  కి బాగా గుచ్చుకునేలా  ఉన్నాయి. ఆయన ఏకంగా సీఎం సొంత గడ్డ మీద దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ని పొగడడం ద్వారా తాను చెప్పదలచుకున్నది చెప్పేశారు. వైఎస్సార్ రాజ్యాంగాన్ని గౌరవించేవారని ఎదుటి వారి భావ ప్రకటన స్వేచ్చకు అవకాశం ఇచ్చారని కూడా నిమ్మగడ్డ చెప్పడం విశేషం.
ఆయన వైఎస్సార్ గురించి నాలుగు మంచి మాటలే చెప్పారు. కానీ సరైన టైమ్ చూసుకుని మరీ చెప్పారు. దాంతో మొత్తం వైసీపీ శిబిరం ఇరకాటంలో పడుతోంది. వైఎస్సార్ ని పొగిడిన నిమ్మగడ్డను డైరెక్ట్ గా ఏమీ అనలేరు. వైఎస్సార్ పేరు మీదనే పుట్టిన పార్టీ అది.    వైఎస్సార్ మంచి వారు అంటూ నిమ్మగడ్డ బాగానే చెబుతున్నారు. మరెలా దాన్ని కౌంటర్ చేయాలి. వైఎస్సార్ ఎపుడో 2009లో చనిపోతే ఇపుడు గుర్తుకు వచ్చారా అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిమ్మగడ్డ మీద కామెంట్స్ చేశారు.
వైఎస్సార్ గురించి మాట్లాడుతూనే ఆయన విగ్రహాలకు ముసుగులు వేశారంటూ ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కౌంటర్లేస్తున్నారు. మరో మంత్రి బొత్స సత్యనారాయణ అయితే నిమ్మగడ్డ  రాజకీయాలు మాట్లాడడం ఏంటని గుస్సా అవుతున్నారు. మొత్తానికి వైఎస్సార్ పేరు మీద నిమ్మగడ్డ వేసిన బాణానికి వైసీపీ క్యాంప్ టోటల్ గా విలవిలలాడుతోందనే చెప్పాలేమో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: