గుడ్ న్యూస్: వోడాఫోన్ కస్టమర్లు ఉచితంగా 50GB డేటా పొందవచ్చు.. వివరాలివే..!?

N.ANJI
మీరు వోడాఫోన్  వాడుతున్నారా. అయితే ఇది మీకు అదిరిపోయే గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక ఎంపిక చేసిన ప్లాన్ పై ఫ్రీగా 50GB డేటాను అందించనున్నట్లు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. అయితే ఇంతకీ ఆ ప్లాన్ ఏంటి.. ఎలా పొందాలని అనుకుంటున్నారా.. అయితే ఈ వార్త చదివేయండి మరి.
ఇక రూ .2,595 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ను స్వీకరించే వినియోగదారులకు అదనంగా 50 జీబీ డేటాను అందిస్తోంది వోడాఫోన్ యాజమాన్యం వెల్లడించింది. ఈ ప్లాన్ తో ప్రతిరోజూ 2 జీబీ డేటాను అందించనున్నారు. దీంతో వినియోగదారులకు మొత్తం 730GB డేటాను అందించనున్నారు. దీంతో పాటు 50GB అదనంగా అందించనుంది. దీంతో మొత్తం 780GB డేటాను అందిస్తుందని వోడాఫోన్ యాజమాన్యం తెలిపారు.
అయితే ఈ ప్రణాళికలో ఇతర సౌకర్యాలు కూడా ఉన్నాయి. వోడాఫోన్ రూ .2,595 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా అపరిమిత కాలింగ్ సదుపాయాన్ని అందిస్తుంది. ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ లు. ఒక సంవత్సరం Z5 సభ్యత్వాన్ని కూడా అందిస్తోంది. వోడాఫోన్ వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ రూ .2,595 తో 365 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంది. రిలయన్స్, జియో ప్రతిరోజూ రూ .2,399 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా 2 జీబీ డేటాను అందిస్తోంది. అపరిమిత కాలింగ్ సౌకర్యంతో పాటు రోజూ 100 ఎస్ఎంఎస్ లు అందిస్తోంది. మొత్తం మీద, వినియోగదారులు ఈ ప్లాన్ ద్వారా 730GB డేటాను పొందుతారు. ఇక జియో 2,399 ప్రీపెయిడ్ ప్లాన్‌కు 365 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది.
ఇక ఎయిర్టెల్ కూడా రూ.2498తో ప్రతిరోజూ 2 జీబీ డేటాతో పాటు 100 ఎస్ఎంఎస్ లను ఉచితంగా అందిస్తోంది. ఈ  ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. దీనికి అదనంగా, మీరు 1 నెల అమెజాన్ ప్రైమ్ వీడియో, ఎయిర్టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం సభ్యత్వాన్ని పొందవచ్చు. అలాగే, 400+ లైవ్ టీవీ ఛానల్, అన్‌లిమిటెడ్ సినిమా, ఫాస్ట్ ట్యాగ్ క్యాష్ బ్యాక్ ను ఎయిర్టెల్ అందిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: