పంచాయతీ ఎన్నికలు ఎక్కడ.. ఎప్పుడు.. ఎలా..?

NAGARJUNA NAKKA
ఏపీలో నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ జరగనుంది. తొలివిడతలో భాగంగా ఫిబ్రవరి ఐదున 14 రెవెన్యూ డివిజన్లలోని 146 మండలాల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ దశలో పదకొండు జిల్లాల్లో పోలింగ్ నిర్వహిస్తారు. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ రెవెన్యూడివిజన్‌లలో శ్రీకాకుళం, ఎచ్చెర్ల, జి.సిగడాం, రణస్థలం, గార, నరసన్నపేట, పొలాకి, జలుమూరు, సారవకోటలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
విశాఖపట్నం జిల్లాలోని విశాఖ రెవెన్యూ డివిజన్‌లో భీమునిపట్నం, పద్మనాభం, ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం, పరవాడల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
తూర్పుగోదావరిజిల్లా విషయానికొస్తే...అమలాపురం రెవెన్యూ డివిజన్‌లో అయినవల్లి, అల్లవరం, అమలాపురం, అంబాజీపేట, ఆత్రేయపురం, ఐ.పోలవరం, కాట్రేనికోన, కొత్తపేట, మలికిపురం, ముమ్ముడివరం, మామిడికుదురు, పి.గన్నవరం, రావులపాలెం, రాజోలు, సఖినేటిపల్లి, ఉప్పలగుప్తం మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు రెవెన్యూ డివిజన్‌లో భీమడోలు, చింతలపూడి, దెందులూరు, ద్వారకా తిరుమల, ఏలూరు, గణపవరం, కామవరపుకోట, లింగపాలెం, నల్లజెర్ల, నిడమర్రు, పెదపాడు,పెదవేగి, పెంటపాడు, టి.నర్సాపురం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరుల్లో ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తారు.
కృష్ణా జిల్లాలో తొలివిడతలో భాగంగా నూజివీడు రెవెన్యూ డివిజన్‌లో ఎ.కొండూరు, ఆగిరిపల్లి, బాపులపాడు, చాట్రాయి, గంపలగూడెం, గన్నవరం, ముసునూరు,నూజివీడు, పమిడిముక్కల, రెడ్డిగూడెం, తిరువూరు, ఉంగుటూరు విసన్నపేట, ఉయ్యూరుల్లో ఎన్నికలు జరగనున్నాయి.
గుంటూరు రెవెన్యూ డివిజన్‌లో అమరావతి, అచ్చెంపేట, బెల్లకొండ, గుంటూరు, క్రోసూరు, మంగళగిరి, మేడికొండూరు, ముప్పాళ్ల, పెదకాకాని, పెదకూరపాడు, పెదనందిపాడు, ఫిరంగిపురం, ప్రత్తిపాడు, రాజుపాలెం, సత్తెనపల్లి, తాడేపల్లి, తాడికొండ, తుళ్లూరు, వట్టిచెరుకూరుల్లో ఎన్నికలు జరపనున్నారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లాలోని నెల్లూరు రెవెన్యూ డివిజన్‌లో బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరిపేట, కొడవలూరు, కోవూరు, మనుబోలు, ముత్తుకూరు, నెల్లూరు రూరల్‌, పొదలకూరు, రాపూరు, టి.పి.గూడూరు, వెంకటాచలం, విడవలూరు మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
కర్నూలు జిల్లా ఆధోని రెవెన్యూ డివిజన్‌లో ఆలూరు, చిప్పగిరి, దేవనకొండ, హలహర్వి, హోలగూడ, ఆస్పరి, కోసిగి, కౌతాలం, మంత్రాలయం, పెద్ద కడుబూర్‌, ఆదోని, గోనెగండ్ల, నందవరం, ఎమ్మిగనూరుల్లో ఎన్నికలు నిర్వహిస్తారు.
అనంతపురం జిల్లాలోని పెనుకొండలోని ఆగలి, అమరాపురం, చిలమత్తూరు, గోరంట్ల, గుదిబండ, హిందూపురం, లేపాక్షి, మడకశిర, పరిగి, పెనుకొండ, రొద్దాం, రోళ్ళ, సోమందేపల్లిలో తొలిదశ ఎన్నికలు జరగనున్నాయి.
వైయస్సార్‌ కడపజిల్లాలోని జమ్మలమడుగు, కడప రెవెన్యూ డివిజన్‌లలో పులివెందుల, సింహాద్రిపురం, తొండూరు, వేంపల్లి, వేముల, లింగాల, జమ్మలమడుగు, కొండాపురం, ముద్దనూరు, మైలవరం, పెద్దముడియం, చక్రాయపేట, యర్రగుంట్లలో ఎన్నికలు జరిపించనున్నారు.
చిత్తూరు జిల్లా తిరుపతి రెవెన్యూ డివిజన్‌లో బి.ఎన్‌ కండ్రిగ, చంద్రగిరి, కె.వి.బి. పురం, నాగలాపురం, పాకాల, పిచ్చాటూరు, పులిచర్ల, రేణిగుంట, సత్యవేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, తిరుపతి, వరదయ్యపాలెం, ఏర్పేడు మండలాల్లో తొలిదశలో ఎన్నికలు నిర్వహించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: