భారత్‌పై యుద్ధానికి సిద్ధమవుతున్న చైనా.. ఇదిగో కీలక సాక్ష్యం..!?

Chakravarthi Kalyan
భారత్‌కు పక్కలో బల్లెంగా మారిన చైనా.. మన దేశంపై యుద్ధానికి సిద్ధమవుతోందా.. ఇండియా పై దాడికి చైనా సమయాత్తం అవుతోందా.. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటోందా..అంటే అవుననే సమాధానం వస్తోంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తన సైనిక బలగాలకు ఇచ్చిన ఓ సందేశం ఇప్పుడు కలకలం రేపుతోంది. పోరాట నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకొని, అత్యున్నతస్థాయి అప్రమత్తతను కలిగి ఉండాలని.. ఏ క్షణాన యుద్ధం వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జిన్ పింగ్‌ ఆ సందేశంలో చెప్పారు.
సైనిక బలగాలపై తనకు విస్తృత అధికారాలను కల్పించే కొత్త రక్షణ చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో జిన్‌ పింగ్  చేసిన ఈ వ్యాఖ్యలు యుద్ధ సన్నాహాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీతో పాటు కేంద్ర సైనిక కమిషన్‌ కు నేతృత్వం వహిస్తున్న  జిన్‌పింగ్‌...  ఈ ఏడాది కమిషన్‌కు సంబంధించిన తొలి ఉత్తర్వుపై ఆయన సంతకం చేశారు. చైనా సైన్యం, సాయుధ పోలీసు దళాల శిక్షణకు సంబంధించిన ప్రాధాన్యతలను ఈ ఆదేశంలో పేర్కొన్నారు. ఇందులో  వాస్తవ యుద్ధరంగాన్ని పోలి ఉండే పరిస్థితుల్లో శిక్షణ పొందాలని  సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు.
అంతే కాదు.. చైనా తన పోరాట వ్యూహాలపై మరింత పరిశోధన సాగించాలని.. యుద్ధవిన్యాసాలను పెంచాలని జిన్ పింగ్ కోరారు. అధునాతన ఆయుధాలను వాడే నైపుణ్యం పెంచుకోవాలని జిన్ పింగ్ కోరారు. ఇవన్నీ చూస్తుంటే ఇండియాపై చైనా యుద్ధానికి సిద్ధమవుతున్న కనిపిస్తోంది. ఇండియా చైనా మధ్య కొంతకాలంగా ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. అంతే కాదు.. చైనా ఇండియాలో ఏకంగా 1200 కిలోమీటర్ల దూరం ఆక్రమించిందంటూ విమర్శలూ వచ్చాయి.  చైనా ఇండియాకు ఇప్పుడు చాలా ప్రమాదకరమైన, బలమైన శత్రువు. అయినా సరే భారత్ మాత్రం చైనా విషయంలో ఎక్కడా రాజీపడటం లేదు. లద్దాఖ్ ప్రాంతంలో మన భూభాగాల్లోకి చొచ్చుకు రావాలని ప్రయత్నించినా.. మన భౌగోళిక సరిహద్దులు మార్చాలని ప్రయత్నించినా ఎక్కడా రాజీపడకుండా తగిన బుద్ది చెబుతోంది. అందుకే ఇండియా- చైనా సరిహద్దుల్లో తరచూ సైనిక ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. భారత్‌ కూడా ఏమాత్రం తగ్గకుండా యుద్ధానికి సైతం సై అంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: