గుడ్ న్యూస్ చెప్పిన వోడాఫోన్ ఐడియా.. సరికొత్త సర్వీస్ అందుబాటులోకి..?

praveen
మొన్నటివరకు నష్టాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్న వొడాఫోన్ ఐడియా నెట్వర్క్ ప్రస్తుతం తమ నెట్వర్క్ ను మరింత విస్తరించేందుకు ఎన్నో వినూత్న మైన సర్వీస్ లను  అందుబాటులోకి తీసుకువచ్చి తమ కస్టమర్ల సంఖ్య పెంచుకునేందుకు ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు కదులుతుంది అన్న విషయం తెలిసిందే. క్రమంలోనే  అధునాతన సర్వీసులను అందిస్తుంది వొడాఫోన్ ఐడియా.  ఇక ఇప్పుడు వోడాఫోన్ ఐడియా నెట్వర్క్ తమ కస్టమర్ల కోసం ఒక అధునాతన సర్వీస్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వొడాఫోన్ ఐడియా ఇటీవలే వైఫై కాలింగ్ సర్వీస్ను అందుబాటులోకి తీసుకువచ్చింది.


 సాధారణంగా ప్రస్తుతం సెక్యులర్ నెట్వర్క్ ద్వారా కాలింగ్ చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోని సిగ్నల్ వీక్ గా ఉన్న సమయంలో ఎంతగానో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం వైఫై ద్వారా కూడా ఎలాంటి అంతరాయం లేకుండా కాలింగ్ చేసుకునేందుకు  అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుని ఈ వినూత్నమైన సర్వీస్ను అందుబాటులోకి తీసుకువచ్చి కస్టమర్లని ఎంతో ఆకర్షించింది వొడాఫోన్ ఐడియా.  ఇక ప్రస్తుతం వొడాఫోన్ ఐడియా తీసుకువచ్చిన వైఫై కాలింగ్ ద్వారా తమ కస్టమర్లకు ఎంతో ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది అని భావిస్తున్నట్లు తెలిపింది.

 ప్రస్తుతం వైఫై కాలింగ్ ప్రాజెక్టు మహారాష్ట్ర గోవా కోల్కతా సర్కిళ్లలో ప్రారంభించాము అంటూ తెలిపిన వోడాఫోన్ ఐడియా.. ఇక రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ఈ సరికొత్త సర్వీసును ప్రారంభించింది కస్టమర్లకు అందుబాటులోకి తీసుకు వస్తాము  అంటూ స్పష్టం చేసింది. వైఫై కాలింగ్ సర్వీస్లో భాగంగా సెక్యులర్ నెట్వర్క్ ద్వారా కాకుండా వైఫై ద్వారా కాల్ కనెక్ట్ అవుతుంది ఈ క్రమంలోనే సిగ్నల్ వీక్ గా ఉన్నప్పటికీ కాల్ డ్రాప్ అయ్యే అవకాశం ఉండదు నిరంతరాయంగా కాల్ మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది. కాగా జియో  ఎయిర్టెల్ లాంటి నెట్వర్క్లు ఏడాది క్రితమే ఈ సరికొత్త సర్వీస్ను తమ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చాయి అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: