వొడాఫోన్ ఐడియా పేరు మారింది.. కొత్త పేరుతో మార్కెట్ లోకి..!

praveen
ప్రస్తుతం టెలికాం రంగ సంస్థల్లో ఎక్కువ వినియోగదారులను కలిగి ఉన్న కంపెనీలలో ఒకటిగా వొడాఫోన్ ఐడియా ఉన్న విషయం తెలిసిందే. అయితే వొడాఫోన్ ఐడియా సంస్థల విలీనం తర్వాత కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ఎన్నో కీలక నిర్ణయాలు ముందుకు సాగుతున్నాయి . తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సారి ఏకంగా తన బ్రాండ్ పేరును మార్చేందుకు నిర్ణయించింది వోడాఫోన్ ఐడియా కంపెనీ. కొత్త పేరుతో కస్టమర్ల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

 అయితే ఇప్పటి వోడాఫోన్ ఐడియా విలీనం తర్వాత రెండు కంపెనీలు ఒకే పేరుతో మార్కెటింగ్ చేసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సరికొత్త బ్రాండ్ నేమ్ తో మార్కెట్ లోకి దూసుకు వచ్చేందుకు సిద్ధం అయ్యింది వోడాఫోన్ ఐడియా కంపెనీ. ఇక వొడాఫోన్ ఐడియా కొత్త బ్రాండ్ పేరు 'విఐ' గా ఉండనున్నట్లు తెలుస్తోంది. అంటే వొడాఫోన్ ఐడియా కంపెనీ ప్రీపెయిడ్ కార్డ్ సహా మరిన్ని ఇతర మార్కెటింగ్ ప్రొడక్టులపై కూడా ఈ గుర్తును చూసేందుకు వీలు ఉంటుంది..


 ఏజిఆర్  కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో... వొడాఫోన్ ఐడియా కంపెనీ బోర్డు ఏకంగా 25 వేల కోట్ల నిధుల సమీకరణకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమ బ్రాండ్ పేరును మార్చడం గమనార్హం. అయితే దీనిపై వోడాఫోన్ ఐడియా సీఈఓ  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు సంవత్సరాల క్రితమే వోడాఫోన్ ఐడియా కంపెనీ లో విలీనం అయ్యాయి అని గుర్తు చేసిన ఆయన... అప్పటి నుంచి ఈ రెండు కంపెనీలకు సంబంధించిన నెట్వర్కులు ఉద్యోగులందరినీ కూడా ఒక్కటి  చేయడంలో నిమగ్నమయ్యాము  అంటూ తెలిపారు. ఇక ప్రస్తుతం ఈ రెండూ బ్రాండ్లను కలిపి విఐ పేరుతో కొత్త బ్రాండ్  మార్కెట్లోకి తీసుకు వచ్చేందుకు సిద్ధపడినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఈ కొత్త బ్రాండ్ పేరుతో విలీన ప్రక్రియ పూర్తయిందని..  కస్టమర్ లు అందరికీ మెరుగైన సేవలు అందిస్తాము  అంటూ ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: