అదృష్టం అంటే ఇదే మరి.. మూడంతస్తుల నుండి దూకిన ఏం కాలేదు.?

praveen

మన టైం బాగోలేక పోతే ఆ దేవుడు కూడా ఏం చేయలేడు అని అంటూ ఉంటారు... భూమి మీద నూకలు  ఉండాలే కానీ ఎలాంటి ప్రమాదం వచ్చిన యమధర్మరాజు కూడా ఏమి చేయలేదు అని చెబుతూ ఉంటారు. ఇలాంటి సామెతలు సరిపడే కొన్ని ఘటనలు తెర  మీదకి వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. తాజాగా జరిగిన ఘటన ఇలాంటి కోవకు చెందినదే . చనిపోయారు అనుకున్న చిన్నారులు బతికి బయటపడ్డారు. మూడో అంతస్తు నుంచి కిందకి వేలాడుతున్న చిన్న పిల్లలను  చూసి అందరూ ఎంతో భయపడిపోయారు.  అక్కడినుంచి పడితే ప్రాణాలు పోవడం ఖాయం అని అనుకున్నారు. కానీ అంతలో  వారు బతికి బయటపడ్డారు. 

 

 ఈ ఘటన ఫ్రాన్స్ లో జరిగింది. గ్రేనోబుల్ నగరం లోని ఓ అపార్ట్మెంట్ లో... ప్రమాదవశాత్తు భారీ మొత్తంలో మంటలు చెలరేగాయి. అపార్ట్మెంట్ లో నివసించే వారంతా తీవ్ర భయాందోళనకు గురి అవుతూ బయటకు పరుగులు పెట్టారు. మూడో అంతస్తులోని ప్లాట్ లో ఇద్దరు పిల్లలు ఇరుక్కు పోయారు. ఇద్దరు పిల్లల్లో ఒకరి వయసు 10 సంవత్సరాలు కాగా మరొకరు మూడు సంవత్సరాలు మాత్రమే, తల్లిదండ్రులు బయటకు వెళుతూ పిల్లలిద్దరినీ ఇంట్లో ఉండేలా తాళం వేసి వెళ్ళిపోయారు. 

 

 దీంతో భారీగా మంటలు వ్యాపించి ఉన్నప్పటికీ బయటకి పరిగెడదాం అంటే ఆ చిన్నారుల దగ్గర తాళంచెవి కూడా లేదు.  అపార్ట్మెంట్ లో భారీగా మంటలు చెలరేగి పోతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే దట్టమైన పొగ మొత్తం కమ్ముకుంటుంది. దీంతో వారి ప్రాణాలు పోతాయి అని అందరూ తెగ భయపడిపోతున్నారు. ఆ పిల్లలు కూడా భయంతో వణికి పోతున్నారు, ప్రాణాలు కాపాడు కోవాలి అనే ధైర్యంతో 3 అంతస్థుల నుంచి ఆ పిల్లలు ధైర్యం చేసి దూకారు. ఒకరి తర్వాత ఒకరు దూకడంతో అప్పటికే కింద ఉన్న రెస్క్యూ టీం పిల్లలను జాగ్రత్తగా ఒడిసి పట్టుకుంది. వారికి ఒక్క దెబ్బ కూడా తగలకుండానే ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఇలా భూమ్మీద నూకలు ఉంటే యమధర్మరాజు కూడా ఏమీ చేయలేడు అన్నది ఈ ఘటనతో నిరూపణ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: