ఇమ్యూనిటీని పెంచుకోవడానికి  ఈ డ్రింక్ తాగితే చాలు...

Suma Kallamadi

 ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇమ్యూనిటీ పైన దృష్టి పెడుతున్నారు. ఈ కరోనా వైరస్ నుంచి తమని తాము కాపాడుకోవడానికి ఇమ్యూనిటీని పెంచుకోవడానికి మార్గాలు వెతుకుతున్నారు. అయితే సులువుగా ఇమ్యూనిటీని పెంచుకోవాలంటే ఏం చేయాలి..? పెద్దగా ఏమి  కష్టపడక్కర్లేదు. కేవలం ఈ ఒక్క ఇమ్యూనిటీ డ్రింక్ తో మీ ఇమ్యూనిటీని బాగా పెంచుకోవచ్చు. అసలు ఇమ్యూనిటీ పవర్ వల్ల ఏమి కలుగుతుంది అనుకుంటున్నారా..? ఇమ్యూనిటీ అంటే  రోగ నిరోధక శక్తి దీని వల్ల మనల్ని అనేక ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. మనం పుట్టినప్పుడు కొంత ఇమ్యూనిటీ తో పుడతాం. ఆ తర్వాత  మనం తినే తిండి బట్టి మన జీవన శైలిని బట్టి ఇమ్యూనిటీ స్థాయి అనేది పెరుగుతుంది.

 

అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇమ్యూనిటీని పెంచుకోవడానికి చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నారు కాబట్టి మీరు తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ ని చాలా సులువుగా పెంచుకోవచ్చు. ఈ  ఇమ్యూనిటీ డ్రింక్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:

 

ఆల్మండ్ మిల్క్ ఒక కప్పు, పసుపు ఒక టీ స్పూన్, అల్లం ఒక టీ స్పూన్, బాదం పప్పు మూడు, నట్  మెగ్ పౌడర్ ఒక చిటికెడు , దాల్చిన చెక్క పొడి ఒక చిటికెడు, మిరియాల పొడి ఒక చిటికెడు, బెల్లం పొడి ఒక టీ స్పూన్.


తయారు చేసుకునే విధానం:  ముందుగా బాదం పప్పులను సన్నగా తరుక్కుని ఉంచుకోవాలి తరవాత మిగిలిన పదార్థాలన్నీ బాగా బ్లెండ్ చేసిన తర్వాత ఈ సన్నని బాదం పప్పులు కూడా అందులో కలపాలి. దీనిని బనానా అవెకాడో  మ్యూస్ తో కలిపి తీసుకుంటే ఇంకా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇమ్యూనిటీ డ్రింక్  ఆరోగ్యంగా ఉంటుంది అంతే కాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి ఒక సారి మీరు దీనిని తయారు చేసుకుని మీ ఇమ్యూనిటీ స్థాయిని మరింత పెంచుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: